
హైదరాబాద్: తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు హోంశాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేలా
ఈ నెల 2న హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మెమో ఇచ్చారని దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. హోంశాఖ జారీ చేసిన మెమో అక్రమమని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో జీవో 121ను అనుసరించాలని సూచించింది. హోంశాఖ నుంచి వివరాలు సేకరించడానికి సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 15కి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ ప్రారంభ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించి ఆశీస్సులు, బహుమతులు అందించారు. కొందరు దాతలు, పాఠశాల విద్యార్థులు విరాళాలను బాలయ్యకు అందజేశారు. ఆ ఫొటోలు..