టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. పవన్ అభిమానిగా తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని.. ఆయన
వాటికి సమాధానాలు చెప్పాలంటూ రాహుల్ ఎక్స్ లో పెట్టిన పోస్టులు పెద్ద దూరంగా రేపాయి. అప్పటి నుంచి పవన్ అభిమానులు, జన సైనికులకు రాహుల్ టార్గెట్ అయ్యారు. నెట్టింట అతనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. "మీ గొప్పలు పక్కన పెడితే, సమాచార హక్కు చట్టం కింద, మీరు నిర్వహించే శాఖల్లోని ప్రతీ విభాగంలో'' సమాచార బహిర్గతానికి సంబంధించి సెక్షన్ 4.1 (బి) అమలు చేశారా?' అని పవన్ కళ్యాణ్ ను రాహుల్ రామకృష్ణ ప్రశ్నించారు. PESA, 1/70 గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించి ఫలితాలను దయచేసి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నాను. జై తెలంగాణ'' అని పేర్కొన్నారు. వీటిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో, ప్రశ్నించినంత మాత్రాన తాను దేశద్రోహిని కానంటూ మరో ట్వీట్ చేశారు. 'నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేనెళ్లిపోతా' అంటూ తన డైలాగ్ తో ఫన్నీ పోస్ట్ పెట్టారు. అయితే రాహుల్ ఆ పోస్టులన్నీ డిలీట్ తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ రాహుల్ రామకృష్ణ ఎక్స్ లో పెట్టిన పోస్టులు ఇప్పుడు ఆయన టైమ్ లైన్ లో కనిపించడం లేదు. జన సైనికుల ట్రోలింగ్ దెబ్బకు అవి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ''అందరం బాగుండాలి, అందులో నేనుండాలి'' అంటూ రాహుల్ మరికొన్ని పోస్టులు పెట్టారు. తాగి ట్వీట్లు పెడుతున్నారని కామెంట్లు చేసే నెటిజన్లకు కౌంటర్ ఇస్తూ.. ''ఒక 120-పదాల పోస్ట్ రాయాలంటే మత్తులో ఉండాలని గట్టిగా నమ్మే ఇక్కడి లెక్కలేనంత మంది వెర్రి కుర్రాళ్ల కోసం బ్రీత్ అలైజర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టమని నేను 'X' కి విజ్ఞప్తి చేస్తున్నాను. వారి అపారమైన అమాయకత్వాన్ని బట్టి చూస్తే, అది బహుశా ఈ ప్లాట్ఫామ్లో అత్యధికంగా ఉపయోగించే ఫీచర్‌గా మారుతుంది'' అని రాహుల్ పేర్కొన్నారు.''అయినా ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో నేను డ్రింక్ ఎంజాయ్ చేయడమా?.. మీరు నాతో జోక్ చేస్తున్నారా!'' అని ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు రాహుల్ రామకృష్ణ సమాధానంగా చెప్పారు. ''నువ్వు తీసిన సినిమాలకి నువ్వు చేసే ఇంటలెక్చ్యువల్ అతికి ఏమైనా సంబంధం ఉందా? ప్రశ్న వేశావు.. ఒకటే సమాధానం వెయ్యి మంది ప్రూఫ్ తో కొట్టారు.. నేనెళ్లిపోత మావ అన్నావ్.. ఇంకా కవర్ డ్రైవ్స్ ఎందుకు'' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ''నాకు ఎవరూ ఏ సమాధానం ఇవ్వలేదు బ్రదర్. నేనే గొడవ వద్దు అనుకున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వమంటే.. గొడవ, గోల, గలీజు మాటలు తప్ప సమాధానం ఏదీ రాలేదు'' అని రాహుల్ బదులిచ్చారు.మంగళవారం సాయత్రం హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు భారీ ట్రాఫిక్ జామ్ అయిందని.. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉందని ఓ నెటిజన్ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశాడు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు రాహుల్ రామకృష్ణను ట్యాగ్ చేస్తూ.. ''ఏంటి మరి కథ.. ప్రశ్నించే దమ్ము ఉందా'' అని ట్వీట్ చేశాడు. రాహుల్ స్పందిస్తూ.. ''గత వర్షాకాలం సీజన్ లో నేను కొన్ని హానిచేయని ప్రశ్నలు అడిగినప్పుడు ఏమి జరిగిందో ఊహించండి. దమ్ము ఇప్పటికీ ఉంది బ్రదర్. జస్ట్ ఓపిక ఉంటలేదు, ఒంటరిగా నిలబడుతున్నా కాబట్టి'' అని సమాధానమిచ్చారు. ఈ పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.