
ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?ఒక కిలోమీటర్ నడవడానికి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా? June 10, 2026 Subhash బరువు తగ్గాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా నడక ఎంతో ముఖ్యం. అయితే 1 కిలోమీటర్
దూరం పూర్తి కావడానికి మనం ఎన్ని అడుగులు వేయాలో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గాలన్నా ఒక సాధారణ వ్యక్తి మోడరేట్ (సాధారణ) వేగంతో నడిస్తే, ఒక కిలోమీటర్ పూర్తి కావడానికి సుమారు 1,250 నుండి 1,550 అడుగులు పడతాయి. సగటున దీనిని 1,300 - 1,400 అడుగులుగా చెప్తారు. సగటు అడుగుల సంఖ్య ఎక్కువ ఎత్తు ఉన్నవారి కాళ్లు పొడవుగా ఉండటంతో అడుగు పెద్దదిగా పడుతుంది. వారు తక్కువ అడుగులతోనే కిలోమీటర్ పూర్తి చేస్తారు. పొట్టిగా ఉంటే ఎక్కువ అడుగులు పడతాయి. ఎత్తును బట్టి అడుగులు
ఎత్తుల తేడా కారణంగా సగటున ఒక పురుషుడు 1 కిలోమీటర్ నడవడానికి 1,300 నుండి 1,400 అడుగులు వేస్తే, ఒక మహిళకు 1,400 నుండి 1,500 అడుగులు అవసరమవుతాయి. స్త్రీ, పురుషులకు అడుగుల్లో తేడా
సాధారణంగా నడిస్తే ఎక్కువ అడుగులు పడతాయి. బ్రిస్క్ వాకింగ్ చేస్తే అడుగుల సంఖ్య 1,200 నుండి 1,350కి తగ్గుతుంది. రన్నింగ్‌తో 1,000 నుండి 1,200 అడుగుల్లోనే కిలోమీటర్ పూర్తవుతుంది. వేగంగా నడిస్తే..
ఒక వ్యక్తి సాధారణ వేగంతో నడిస్తే 1 కిలోమీటర్ పూర్తి చేయడానికి 12 నుండి 15 నిమిషాల సమయం పడుతుంది. అదే వేగంగా నడిస్తే 10 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. కిలోమీటర్ నడవడానికి ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజుకు 10 వేల అడుగులు నడవడం మంచిది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరు రోజుకు సుమారు 7 నుండి 7.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. 10,000 అడుగుల లక్ష్యం
అడుగుల సంఖ్య మనుషులను బట్టి మారినా, రోజుకు కనీసం 30 నిమిషాలు లేదా 4-5 కిలోమీటర్లు నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. అడుగుల సంఖ్య మరిన్ని వెబ్ స్టోరీస్ ఏసీకి గడువు ఉంటుందా? ఎన్నేళ్ల పాటు వాడవచ్చు..? ఇవి గుర్తించుకోండి టీవీని ఎంత దూరం నుంచి చూస్తే మంచిదో తెలుసా..? ఆధార్ ఉన్న వారికి గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు ఉచితంగానే..!