
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన ఎన్నికైన నేతగా చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్
, ప్రధాని మోదీని అభినందిస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సభ్యులంతా నిలబడి చప్పట్లతో ఆయనకు తమ గౌరవాన్ని తెలిపారు.ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానిగా ఆయన 4,399 రోజులు పూర్తిచేసుకుని, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలాన్ని ఈ పోలిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 1947 నుంచి 1952 మధ్య నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. మరోవైపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా పదవిలో ఉన్నప్పటికీ, ఆమె పాలన నిరంతరాయంగా సాగలేదు. దీంతో వరుసగా మూడుసార్లు (2014, 2019, 2024) గెలిచి, నిరంతరాయంగా అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా మోదీ నిలిచారు.ఈ చారిత్రక సందర్భాన్ని, అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకోవడానికి ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ సాయంత్రం భారత్ మండపంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనతపై ఎన్డీయే కూడా ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్