
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Narendra Modi Creat New Record in india Politics: అవును మన దేశానికి బ్రిటిష్ వాళ్లు స్వాతంత్య్రం ఇచ్చిన తర్వాత అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా ఉన్న జవహర్ లాల్ aనెహ్రూ స్వాతంత్ర్య భారత దేశంలో ప్రధానిగా నామినేట్ చేయబడ్డారు. ఆ తర్వాత మన దేశం గణతంత్య్రం అయిన తర్వాత 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో భారత దేశ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాన మంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆ తర్వాత 1957, 1962 వరుసగా మూడు ఎన్నికల్లో భారత ప్రజలు అప్పటి ప్రధానిగా నెహ్రూను వరుసగా ఎన్నుకున్నారు. ఆయన 27 మే 1964లో కన్నుమూసేంత వరకు ఆయనే ప్రధానిగా ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్షాలు అంత బలంగా ఉండేవి కావు. అలాంటి సమయంలో ఈయన ప్రధానిగా ఆయన్ని ఎన్నుకోవడం తప్పించి వేరే ఆప్షన్ లేకుండా పోయిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.
నెహ్రూ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రిగా4398 రోజులు కంటిన్యూగా పనిచేశారు. ఆయన రికార్డును తాజాగా ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధిగిమించారు. బలమైన ప్రతిపక్షాలు ఉన్న ఈ సమయంలో వరుసగా 2014, 2019, 2024లలో వరుసగా మూడు సార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన తొలి కాంగ్రెసేతర నేతగా రికార్డు క్రియేట్ చేశారు. నేటితో ఆయన నెహ్రూ పాలించిన 4398 రోజుల రికార్డును అధిగమించారు. నేటితో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ 4399 రోజులు అవుతుంది.
అంతేకాదు 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి.. ఆపై ప్రధాన మంత్రిగా అత్యధిక కాలం అంటే 24 యేళ్లు కంప్టీట్ అయి 25వ యేట అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా పనిచేసి దీనితో, 8,930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్‌ను ప్రధాని మోదీ అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన పదవీకాలాన్ని కలుపుకొని, ఆయన ఇప్పుడు ప్రభుత్వ అధిపతిగా 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ అక్టోబర్‌లో ప్రభుత్వాధినేతగా 25 యేళ్లు కంప్లీట్ అవుతుంది. ఇది కూడా మన దేశ చరిత్రలో ఓ రికార్డు. సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదనే చెప్పాలి. ప్రధానిగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ప్రధాన మంత్రికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా క్యాబినేట్ సహచరులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు శుభాకాంక్షలు తెలియజేసారు.
ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి 100 రోజుల్లో దేశ ప్రజలకు జన్ ధన్ ఖాతాలను తెరిపించారు. 122 రోజులకు మేక్ ఇన్ ఇండియా అంటూ దేశాన్ని పురోగతి వైపు మళ్లించారు. 401 రోజుల్లో డిజిటల్ ఇండియా కలను సాకారం చేశారు. ఫస్ట్ టర్న్‌లో GST వంటి పన్నుల విధానాన్ని తీసుకొచ్చారు. 1433 రోజుల్లో దేశంలో ప్రతి పల్లెకు కరెంట్ తీసుకొచ్చారు. రెండో టర్మ్‌లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35Aను రద్దు చేశారు. అటు అయోధ్య రామమందిరాన్ని నిర్మించారు. అటు వక్ఫ్ బోర్డ్ కోరలు పీకి దాన్ని సరైన దారిలో పెట్టిన నేతగా రికార్డులు క్రియేట్లు చేశారు. యూపీఐ ట్రాన్స్జాక్షన్స్, దేశంలో నక్సలిజాన్ని అంతం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశ ప్రజలకు మరుగుదొడ్లు కట్టించారు. వందే భారత్, వందే అమృత్ భారత్ వంటి రైళ్లతో దేశాన్ని పరుగులు పెట్టించారు. దేశంలో రహదారుల విస్తరణ...ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే సౌకర్యం, ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం వంటివి మోడీ ఖతాలో ఉన్నాయి. అంతేకాదు 32 దేశాల నుంచి భారతరత్నతో సమానమైన అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఒక్క ఎలక్షన్ ఓడిపోని నేతగా నిలిచారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఒక టర్మ్ మొత్తం పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి కూడా నరేంద్ర మోడీ రికార్డు క్రియేట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.