
Vadde Naveen:వడ్డే నవీన్, ఆయన భార్య మీనా పాల్గొన్న రాపిడ్ ఫైర్ రౌండ్లో వచ్చిన సమాధానాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తన భర్త కంటే ఇష్టమైన హీరోగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం అందరి దృష్టిని
ఆకర్షించింది.
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వడ్డే నవీన్, ‘పెళ్లి కోరుకున్న ప్రియుడు’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించిన ఓ సరదా ఇంటర్వ్యూలో వడ్డే నవీన్ తన భార్య మీనాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ వారిద్దరితో రాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. ఈ రౌండ్లో వచ్చిన సమాధానాలు అందరినీ నవ్వించాయి.
మొదటగా సుమ, మీనాకు ఇష్టమైన రంగు ఏమిటని వడ్డే నవీన్‌ను అడిగారు. దానికి ఆయన వెంటనే “ఎల్లో” అని సమాధానం చెప్పారు. వెంటనే మీనా కూడా అది సరైన సమాధానమే అని చెప్పి థంబ్స్ అప్ ఇచ్చారు. ఆ తర్వాత మీనాకు ఇష్టమైన ఫుడ్ ఏంటని ప్రశ్నించగా, నవీన్ “చికెన్ వింగ్స్” అని చెప్పారు. ఈ సమాధానం కూడా కరెక్ట్ కావడంతో అక్కడ సరదా వాతావరణం నెలకొంది.
అయితే అందరిలో ఎక్కువ ఆసక్తి కలిగించిన ప్రశ్న మరోటి. “మీనా గారికి మీకన్నా ఎక్కువ ఇష్టమైన హీరో ఎవరు?” అని సుమ అడిగారు. దీనికి వడ్డే నవీన్ ఏమాత్రం ఆలోచించకుండా “పవన్ కళ్యాణ్” అని సమాధానం ఇచ్చారు. ఆ మాట విన్న వెంటనే మీనా చాలా ఎగ్జైట్ అవుతూ “అవును.. కరెక్ట్” అని చెప్పింది. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. ఆమెకు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని ఈ సమాధానం మరోసారి బయటపెట్టింది.
చివరగా మీనాకు ఇష్టమైన యాంకర్ ఎవరు అని అడిగినప్పుడు, వడ్డే నవీన్ “సుమ” అని చెప్పారు. ఈ సమాధానం కూడా సరైనదేనని మీనా చెప్పడంతో సుమతో పాటు అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
ఈ సరదా ఇంటర్వ్యూలో వడ్డే నవీన్, మీనా మధ్య ఉన్న అనుబంధం, ఒకరిపై ఒకరికి ఉన్న అవగాహన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వారి సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.