
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమ్ఇండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు సాధించారు. రిషభ్ పంత్ (81), సాయి సుదర్శన్ (81)
, వాషింగ్టన్ సుందర్ (52*) హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు. శతకం చేసే అవకాశం సుదర్శన్‌తోపాటు రిషభ్ పంత్ చేజార్చుకున్నాడు. అయితే, రిషభ్ పంత్ ఇలా 80లు, 90ల్లో ఔట్ కావడం ఇదేమీ కొత్త కాదు. భిన్నమైన షాట్లు ఆడి మరీ వికెట్‌ను సమర్పించిన రోజులున్నాయి. దీనివల్ల టీమ్ఇండియాకు కొన్నిసార్లు నష్టం వాటిల్లినట్లు మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు 50 టెస్టులు ఆడిన పంత్ ఖాతాలో 8 సెంచరీలు మాత్రమే ఉన్నాయి. మరో ఎనిమిదిసార్లు శతకాలు చేసే అవకాశం కాస్తలో చేజార్చుకున్నాడు.
‘‘రిషభ్ పంత్ చాలాసార్లు 80లు, 90ల వద్ద ఔటయ్యాడు. అయితే, ఇలాంటి దూకుడైన బ్యాటర్ టెస్టుల్లో దొరకడం కష్టమే. కానీ, 80ల్లోకి వచ్చాక భిన్నమైన షాట్లను ప్రయత్నించి పెవిలియన్‌కు చేరడం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరో 20 పరుగులు చేస్తే సెంచరీ అయిపోతుంది. అలా ఆడేందుకు ప్రయత్నించలేడా? విచిత్రమైన షాట్లతో భారత్‌కు కొన్నిసార్లు నష్టం కలిగించాడు. బ్యాటర్‌గా అతడు అదనపు బాధ్యత తీసుకోవాలి. సెంచరీలుగా మలచాలి. అప్పుడు అతడి గణాంకాలు ఇప్పటికంటే అద్భుతంగా ఉండేవి’’ అని అశ్విన్ తెలిపాడు.
‘‘ప్రతి బ్యాటరూ పొరపాట్లు చేయడం సహజమే. కానీ, రిషభ్ పంత్ పదేపదే అవే తప్పులను చేస్తుండటమే నిరాశకు గురి చేస్తోంది. అది తప్పు అని చాలామంది చెప్పినా సరే.. మళ్లీ చేస్తూనే వెళ్తున్నాడు. ఇప్పటికే 50 టెస్టులు ఆడాడు. ఇకనైనా జట్టు కోసం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది’’ అని అశ్విన్ సూచించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.