
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. దేశానికి సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును ఆయన అధిగమించారు
. బుధవారం నాటికి ప్రధానిగా మోదీ పదవీకాలం 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయిన వేళ సంబరాలు జరుపుకోవడానికి కూటమి సిద్ధమైంది.ఈ చారిత్రక ఘట్టంపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ప్రజలకు సేవ చేయడమే సుపరిపాలనకు అసలైన పరీక్ష. అంకితభావం, వినమ్రత, కర్తవ్య దీక్షతో నిరంతరం పనిచేసేవారే ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు" అని ఆయన పేర్కొన్నారు.నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ.. సుదీర్ఘకాల ప్రధానిగా కొత్త చరిత్ర ప్రధానిగా మోదీ నిరంతరాయంగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. గతంలో ఈ రికార్డు జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉండేది. దేశానికి తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన 1952 నుంచి నెహ్రూ పదవీకాలాన్ని ఈ పోలిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. అంతకుముందు 1947 నుంచి 1952 వరకు ఆయన తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఇందిరా గాంధీ 14 ఏళ్లకు పైగా ప్రధానిగా పనిచేసినప్పటికీ, ఆమె పదవీకాలం నిరంతరాయంగా కొనసాగలేదు. దీంతో వరుసగా ఎన్నికై సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2019లో రెండోసారి, 2024లో చారిత్రాత్మకంగా మూడోసారి విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్నారు.మోదీ నాయకత్వంలోని 12 ఏళ్ల పాలనలో కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్