
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్‌గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన
Jun 10 2026 9:38 AM | Updated on Jun 10 2026 10:02 AM
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్‌గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గిరి మారుతీనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్‌కుమార్‌కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. మొదటి భార్య సోదరి నిషారాణి(నిషిత రాణి)నే మరో వివాహం చేసుకున్నాడు. అయితే నిషాకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది.
దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.
అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని నిషారాణిని బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. తుపాకీ గాయాలతో నిషారాణి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, నిషా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
వరంగల్ : కనుల పండువగా ఎస్సార్ స్నాతకోత్సవం (ఫొటోలు)
నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ.. ఫ్యామిలీతో నయన్ ఫారిన్ వెకేషన్ (ఫోటోలు)
విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
కొంచమైనా సిగ్గు లేదా..లోకేష్ కు ఇచ్చిపడేసిన అమర్నాథ్
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై కారుమూరి సంచలన నిజాలు
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..! ఇద్దరికి ఇచ్చి పడేసిన అడ్వకేట్ రజిని
ఫిలిపైన్స్ లో సునామీ అలర్ట్..చూస్తుండగానే పేకమేడల్లా కూలిన భవనాలు