
Trump Towers: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లగ్జరీ హౌసింగ్ బ్రాండ్ ‘ట్రంప్ టవర్స్’ (Trump Towers) ఇప్పుడు అధికారికంగా
నగరంలోకి ప్రవేశించింది. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం పరిధిలోని ఐటీ హబ్ కోకాపేటలో నిర్మించబోయే ఈ అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ గ్రీన్ సిగ్నల్‌తో నగరంలోనే అత్యంత విలాసవంతమైన జీవన ప్రమాణాలకు వేదిక సిద్ధమైంది.
Read also: POKలో పాక్ బలగాల కాల్పులు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
టీజీ రెరా అధికారిక సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ‘ఇరా ది ఎడ్జ్ డెవలపర్స్ ఎల్ఎల్పీ’ (Ira The Edge Developers LLP) సంస్థ ప్రతిపాదించింది. P02400010871 నంబర్‌తో రిజిస్ట్రేషన్ లభించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న కోకాపేట “గోల్డెన్ మైల్” పరిధిలోని దాదాపు 4 ఎకరాల (16,389.76 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరగనుంది. మొత్తం 2,64,580 చదరపు మీటర్ల భారీ బిల్ట్-అప్ ఏరియాతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టును 2031 మే 15 నాటికి పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించారు.
ట్రంప్ ఆర్గనైజేషన్‌కు చెందిన భారతీయ అధికారిక భాగస్వామి ‘ట్రైబెకా డెవలపర్స్’, స్థానిక నిర్మాణ సంస్థ ‘ఇరా రియల్టీ’ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాయి. ఆకాశాన్ని తాకేలా అధునాతన డిజైన్‌తో రెండు భారీ జంట టవర్లను ఇక్కడ నిర్మించనున్నారు. ఇవి సుమారు 63 అంతస్తులకు పైగా ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా. అత్యంత సంపన్నులు, గ్లోబల్ సిటిజన్లను టార్గెట్ చేస్తూ 3, 4, 5 BHK కాన్ఫిగరేషన్లతో ఈ ప్రీమియం నివాసాలను రూపొందిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.3,500 కోట్లుగా ఉండవచ్చని సమాచారం.
ట్రంప్ బ్రాండ్‌కు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్‌కు తగ్గట్లే.. ఈ ప్రాజెక్టులో కళ్లు చెదిరే విలాసవంతమైన సదుపాయాలను కల్పిస్తున్నారు.
భారత్‌లోని ఇతర మెట్రో నగరాల్లో ఇప్పటికే విజయవంతమైన ట్రంప్ టవర్స్, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ వైపు రావడం ఇక్కడి లగ్జరీ హౌసింగ్ డిమాండ్‌కు నిదర్శనం.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుకల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు.. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌లు త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు బిజినెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే, హైదరాబాద్ స్కైలైన్ (Skyline) రూపురేఖలు మారిపోవడమే కాకుండా, నగరానికే ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలవడం ఖాయం.
Fee Reimbursement : ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 10 జూన్ 2026
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Hyderabad Rains Tragedy: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. పాతబస్తీలో కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి
Heavy Rains Telangana: హైదరాబాద్‌లో కుండపోత వాన.. తెలంగాణలోని పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ!
Heavy rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ గాలులతో కూడిన వర్షాలు
Ebola alert in telangana: ఎబోలా కలకలం.. విదేశీ ప్రయాణికులపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
Today Gold Rate: 10 రోజులుగా తగ్గిన పసిడి.. ఇవాళ ఒక్కసారిగా ఎంత పెరిగిందంటే!
Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి : సీపీ సజ్జనార్