వెండితెరపై తన సహజసిద్ధమైన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి సాయిపల్లవి . గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలlo ఎంచుకుంటూ టాలీవుడ్
, కోలీవుడ్‌లలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇటీవలే ‘ఏక్ దిన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె ప్రేమికురాలిగా సున్నితమైన నటనతో అలరించింది. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’లో సీత పాత్రలో కనిపించనుంది. ఇలాంటి విలక్షణమైన పాత్రలతో దూసుకుపోతున్న సాయిపల్లవి, ఇప్పుడు తన కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ఫుల్ యాక్షన్ రోల్‌కు సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ల్యాండ్‌మార్క్ చిత్రం 'ధనుష్ 55' (వర్కింగ్ టైటిల్) లో ఆమె పూర్తి స్థాయి పోలీసు అధికారిణిగా నిందితుల గుండెల్లో వణుకు పుట్టించనుంది.* మహేష్‌బాబు సినిమాకు క్లాప్ కొట్టిన చంద్రబాబు... 28 ఏళ్ల నాటి అరుదైన ఫోటో వైరల్ ఇటీవలే 'అమరన్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నారు. మన చుట్టూనే నిశ్శబ్దంగా జీవిస్తూ, సమాజ రక్షణ కోసం పోరాడే అనామక వీరుల యథార్థ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను దర్శకుడు అద్భుతంగా మలిచారు. ఇందులో సాయిపల్లవి పాత్ర కేవలం దర్యాప్తుకే పరిమితం కాకుండా, శత్రువులను పరుగులు పెట్టించే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సాగుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె సినీ కెరీర్లోనే ఇదొక సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది. సాయిపల్లవి గతంలో ధనుష్‌తో ‘మారి 2’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలిసి డ్యాన్స్ చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ అప్పట్లో సోషల్‌మీడియాని ఓ ఊపు ఊపేసింది.* ‘పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ ధనుష్‌కు చెందిన 'వండర్‌బార్ ఫిల్మ్స్', 'ఆర్ టేక్ స్టూడియోస్' సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు మరో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. తమిళంలో శ్రీలీలకు ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. ఆయన ఇందులో ఒక పవర్ఫుల్ గ్రే-షేడెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సాంకేతిక పరంగానూ ఈ చిత్రం హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోంది. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండగా, ఎళిల్ అరసు ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. భిన్నమైన కథాంశంతో, సాయిపల్లవిని సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.