
Fake SI Arrested: తానే ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) నంటూ కలరింగ్ ఇస్తూ, అమాయకులను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా కేటుగాడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ అవతారమెత్తి
అద్దెకు తీసుకున్న కారును కాజేసిన నిందితుడిని పట్టుకోవడంతో పాటు, అతని వద్ద నుంచి కారును, మోసానికి ఉపయోగించిన పోలీసు యూనిఫాంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ విచిత్రమైన మోసానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు.
Read Also: Botsa Satyanarayana: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్లే ప్రమాదాలు.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంటప్పగారి అనిల్ కుమార్ (27) ఈ మోసాలకు తెరలేపాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో తాను పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో జస్ట్ డయల్ (Justdial) యాప్ ద్వారా కారు యజమాని జి. మనోహర్‌ను సంప్రదించాడు.
తాను ఎస్ఐని అని నమ్మించడానికి, వాట్సాప్ ద్వారా తాను పోలీసు యూనిఫాంలో ఉన్న ఫోటోలను ఓనర్ మనోహర్‌కు పంపించాడు. నిజమైన పోలీస్ అధికారే అని నమ్మిన యజమాని.. తన మారుతి సుజుకి డిజైర్ కారు (AP 39 NT 8616)ను రోజువారీ అద్దె ప్రాతిపదికన అనిల్ కుమార్‌కు అప్పగించాడు. అయితే నిర్ణీత గడువు ముగిసినా కారును కానీ, అద్దెను కానీ ఇవ్వకుండా అనిల్ కుమార్ ముఖం చాటేశాడు.
కారుతో పాటు ఎస్ఐ అని చెప్పిన వ్యక్తి పరార్ కావడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మనోహర్ కళ్యాణదుర్గం రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సెల్ ఫోన్ లొకేషన్ సాయంతో గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందం.. మంగళవారం మధ్యాహ్నం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్ సమీపంలో కారుతో సహా నిందితుడు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఈ నకిలీ ఎస్ఐ అసలు రంగు బయటపడింది. గతంలో అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ తానే పోలీస్ అధికారినని చెప్పుకుంటూ ఇలాంటి పలు మోసాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి నుంచి కారును, మోసానికి వాడిన పోలీస్ డ్రెస్‌ను సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
కళ్యాణదుర్గం ఎస్డీపీఓ (SDPO) పి. రవిబాబు ఆదేశాల మేరకు, సీఐ పి. గణేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించింది. సమర్థవంతంగా పనిచేసి నిందితుడిని పట్టుకున్న సీఐ గణేష్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ పి. రవిబాబు ప్రత్యేకంగా అభినందించారు.
‘Secret’ Dating : ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతున్న ‘సీక్రెట్’ డేటింగ్ ట్రెండ్
Modi Dopidi : ఇది మోదీ దోపిడీ మోడల్ – రాహుల్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Chandrababu Special Article : ప్రధానిపై చంద్రబాబు స్పెషల్ ఆర్టికల్
TGSRTC Jobs Scam Alert: నిరుద్యోగ యువకులరా జాగ్రత్త:వై.నాగిరెడ్డి!
Valavaara Movie Review: ‘వలవార’ (జీ 5) సినిమా రివ్యూ
Peddi New Version: రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో కీలక మార్పులు.. కొత్త వెర్షన్‌తో మరింత ఆకట్టుకునే ప్రయత్నం
AP Politics: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి 41ఏ నోటీసులు!