
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఓటు చోరీ, ఎస్ఐఆర్ తర్వాత
భాజపా ఇప్పుడు సీటు చోరీకి పాల్పడుతోంది. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’’అని పేర్కొన్నారు. భాజపా ‘సీట్ చోరీ’కి పాల్పడుతోంది: సీఎం రేవంత్‌రెడ్డి |