
తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేకు అధికారం కట్టబెట్టేందుకు పనికొచ్చిన హామీల్లో మహిళల రక్షణ కూడా ఒకటి. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలను
అరికట్టేందుకు తాము అధికారంలోకి వస్తే ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విజయ్.. ఇవాళ దాన్ని నిలబెట్టుకున్నారు. ఇవాళ సింగప్పెన్ (Singappen) పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఇవాళ స్వయంగా ప్రారంభించిన విజయ్.. అనంతరం వాహనం కూడా నడిపారు.స్టాలిన్ బిగ్ యూటర్న్..! విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం..!తమిళనాడు ప్రభుత్వం మహిళల రక్షణ కోసం సింగప్పెన్ టాస్క్ ఫోర్స్ పేరుతో కొత్త దళాన్ని ప్రారంభించింది. సింగప్పెన్ లో సింగ అంటే సింహం, పెన్ అంటే మహిళ. రెండు కలిపితే సింహ మహిళా దళం అనే పేరు వచ్చేలా దీనికి ఈ పేరు పెట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గస్తీ పెంచడం, ఫిర్యాదు అందగానే వెంటనే ఘటనా స్ధలికి చేరుకునేలా చూడటం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్య సంస్థలు ఉండే ప్రాంతాల్లో ఎక్కువ గస్తీ నిర్వహించడం, అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న స్థలాలపై నిరంతరం నిఘా పెట్టడం ఈ టాస్క్ ఫోర్స్ చేసే పనులు. 21 మంది AIADMK రెబెల్స్ పై అనర్హత వేటు- స్పీకర్ కీలక నిర్ణయం..!100 లేదా 112 నంబర్ కు మహిళలు ఫిర్యాదు చేస్తే ఈ టాస్క్ ఫోర్స్ వెంటనే స్పందించి వారికి రక్షణ కల్పిస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఓ ఐజీ స్దాయి అధికారి ఉంటారు. ఆయన కింద ఓ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది ఎస్సైలు, 20 ఇతర ర్యాంక్ ల సిబ్బంది కూడా ఉంటారు. వీరంతా మహిళలే. ఇందుకోసం వివిధ విభాగాల నుంచి ఈ టాస్క్ ఫోర్స్ లోకి వీరిని తీసుకుంటున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ను ఇవాళ చెన్నైలోని ఎజ్ముంపూర్ లో ఉన్న రాజరత్నం స్టేడియంలో సీఎం విజయ్ ప్రారంభించారు.