
సికింద్రాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేసిన సందర్భంగా
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మహిళాశక్తి సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గుర్తింపు ఉంటుంది. మహిళలకు ఇవ్వాల్సిన రూ.4వేల కోట్ల సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదు. మహిళలతో పెట్టుకున్న ఎవరైనా అధికారంలో ఉంటారా? మహిళలతో పెట్టుకున్నందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.10,500 కోట్లు చెల్లించాం’’ అన్నారు.
‘‘అందరికంటే ముందుంటామని మహిళలు నిరూపిస్తున్నారు. వ్యవసాయానికి ప్రాణవాయువు ఆడబిడ్డలు. ఆడబిడ్డ పుడితే.. మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడే సంస్కృతి మనది. మన సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక గుర్తిపు ఉంది. మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుంది. మహిళలను స్ఫూర్తిగా తీసుకొని మేం పరిపాలన చేస్తున్నాం. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చేందుకు వందల ఏళ్లు పట్టింది. భారత్‌కు స్వాతంత్ర్యం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత నెహ్రూకే దక్కుతుంది’’ అన్నారు.
దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్‌దే. భాజపా తన పార్టీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా మహిళలకు ఇచ్చారా? బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదు. మా ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చాం. స్థానిక ఎన్నికల్లో మహిళలకు రాజీవ్‌గాంధీ రిజర్వేషన్లు ఇచ్చారు. సోనియా గాంధీ 2013లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు ప్రవేశపెట్టారు.
ఆడ బిడ్డలు ఉచితంగా బస్సులో పక్క ఊరు వెళ్లి చదువుకుంటున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆడపిల్లల డ్రాప్‌అవుట్స్ తగ్గాయి. అంబానీ, ఆదానీలకు పోటీగా పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్‌ను రాష్ట్ర మహిళలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే మహిళా శక్తి భవనాలు నిర్మిస్తాం. హైటెక్‌సిటీ పక్కన రూ.వెయ్యికోట్ల భూమిని మహిళా సంఘాలకు ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి మహిళల చేతుల్లోనే ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను ఏనాడైనా మహిళలు కట్టుకున్నారా? మా ప్రభుత్వం ఇచ్చిన చీర కట్టుకొనే మహిళలు ఈ సభకు వచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేవరకు విశ్రమించను. 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం’’ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలుల తీవ్రతకు రామ్‌నగర్‌లోని వీఎస్టీ రోడ్డులో, హైదర్‌గూడలో భారీ వృక్షాలు నేలకొరగడంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాలకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫొటోలు మీకోసం..
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామంలో కిడ్నీ వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయి.