
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026 Captains: క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు ఫిఫా ప్రపంచ కప్ 2026 వచ్చేస్తోంది. కళ్లు చెదిరే షాట్లతో క్రీడా అభిమానులను అలరించే ఫుట్‌బాల్ ప్రపంచకప్ జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విశ్వఖ్యాతి పొందిన ఈ ప్రపంచకప్ కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రపంచకప్‌ను భారతీయ ప్రేక్షకులు జీ మీడియాలో చూడవచ్చు. జీ5 యాప్‌తోపాటు యునైట్8 స్పోర్ట్స్ ఛానల్స్‌లో ఫిఫా ప్రపంచకప్ ప్రసారాలు జరగనున్నాయి. 48 దేశాలు పోటీపడుతున్న ఈ ప్రపంచకప్‌లో ఆయా జట్లకు ఎవరు సారథ్యం వహించనున్నారో తెలుసుకుందాం.
ఫిఫా ప్రపంచకప్‌లో జూన్ 12వ తేదీన గ్రూప్ దశ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రపంచ కప్ చరిత్రలోని అనేక రికార్డులు, ఘనతలను తిరగరాయబోతున్నది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ 32 సంవత్సరాల తర్వాత ఉత్తర అమెరికా గడ్డపైకి ఈ క్రీడ సంబరం తిరిగి వచ్చింది. సాధారణంగా 32 దేశాలకు బదులుగా 48 దేశాలు పోటీపడుతున్నాయి. దీంతో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 94 నుంచి 104కు పెరిగింది. ఈ ప్రపంచకప్‌లో లియోనెల్ మెస్సీ, ఫాబియో కన్నవారో, ఫ్రాంజ్ బెకెన్‌బాయర్ వంటి దిగ్గజాలు స్టేడియంలో ఆడుతుండడంతో ప్రేక్షకులకు మరింత వినోదం లభించనుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 జట్టు కెప్టెన్లు మెక్సికో: ఎడ్సన్ అల్వారెజ్ దక్షిణాఫ్రికా: రాన్వెన్ విలియమ్స్ దక్షిణ కొరియా: సన్ హ్యూంగ్-మిన్ చెక్ రిపబ్లిక్: లాడిస్లావ్ క్రెజి కెనడా: అల్ఫోన్సో డేవిస్ బోస్నియా, హెర్జెగోవినా: ఎడిన్ డ్జెకో ఖతార్: హసన్ అల్-హేడోస్ స్విట్జర్లాండ్: గ్రానిఫ్రాస్ బ్రెజిల్: మర్కోకన్ మొరకో: హకిమి అమెరికా: టిమ్ రీమ్ పరాగ్వే: గుస్తావో గోమెజ్ ఆస్ట్రేలియా: మాథ్యూ ర్యాన్ టర్కీ: హకన్ కల్హనోగ్లు జర్మనీ: జాషువా కిమ్మిచ్ కురాకో: లియాండ్రో బకునా ఐవరీ కోస్ట్: ఫ్రాంక్ కెస్సియెన్ జపాన్: వాటరు ఎండో స్వీడన్: లిండెలోఫ్ బెల్జియం: టైలెమాన్స్ ఈజిప్ట్: మొహమ్మద్ సలా ఇరాన్: మెహదీ తరేమి న్యూజిలాండ్: క్రిస్ వుడ్ స్పెయిన్: రోడ్రి కేప్ వెర్డే: ర్యాన్ మెండిస్ సౌదీ అరేబియా: సేలం అల్-దవ్సారి ఉరుగ్వే: జోస్ మరియా గిమెనెజ్ ఫ్రాన్స్: కైలియన్ ఎంబాప్పె సెనెగల్: కాలిడౌ కౌలిబాలీ ఇరాక్: జలాల్ హసన్ నార్వే: మార్టినెల్ అర్జెంటీనా: మెస్సీ అల్గెరియా: రియాద్ మహ్రెజ్ ఆస్ట్రియా: డేవిడ్ అలబా జోర్డాన్: ఇషాన్ ఉజ్బెకిస్తాన్: ఎల్డోర్ షోమురోడోవ్ కొలంబియా: జేమ్స్ రోడ్రిగ్జ్ ఇంగ్లాండ్: హ్యారీ కేన్ క్రొయేషియా: లుకా మోడ్రిక్ ఘనా: జోర్డాన్ అయేవ్ పనామా: అనిబల్ గోడోయ్