
సాధారణంగా హీరోయిన్లు ఎలా ఉంటారు.. ఒక సినిమా ఛాన్స్ వచ్చింది అంటే.. వేరే హీరోయిన్ దగ్గరకు వెళ్ళకూడదు అని టక్కున ఆ ఛాన్స్ ని ఒడిసిపట్టుకుంటారు. కానీ, సాయిపల్లవి (Sai Pallavi) అందుకు విరుద్ధం. కథ
నచ్చకపోయినా.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా.. కొంచెం గ్లామర్ ఉందని తెలిసినా వెంటనే నో చెప్పేస్తుంది.
సాధారణంగా హీరోయిన్లు ఎలా ఉంటారు.. ఒక సినిమా ఛాన్స్ వచ్చింది అంటే.. వేరే హీరోయిన్ దగ్గరకు వెళ్ళకూడదు అని టక్కున ఆ ఛాన్స్ ని ఒడిసిపట్టుకుంటారు. కానీ, సాయిపల్లవి (Sai Pallavi) అందుకు విరుద్ధం. కథ నచ్చకపోయినా.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా.. కొంచెం గ్లామర్ ఉందని తెలిసినా వెంటనే నో చెప్పేస్తుంది. అయితే మా ఇంటి బంగారం సినిమాను సాయిపల్లవి చేయాల్సింది. కానీ, ఆమె నో అనడంతో ఆ కథను సమంత చేస్తుంది. ఈ విషయాన్నీ సామ్ నే స్వయంగా వెల్లడించింది. ఇక సినిమాల విషయంలోనే కాదు.. వేరే హీరోయిన్లను మోటివేట్ చేయడంలో కూడా సాయిపల్లవి ముందు ఉంటుంది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ .. సాయిపల్లవి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చింది. 2021వ సంవత్సరంలో ఆమె తన లైఫ్ లోనే ఒక గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నానని, ఆ సమయంలో తను పడుతున్న మానసిక వేదనను అర్ధం చేసుకొని సాయిపల్లవి తనకు ప్రోత్సహాన్ని అందించిందని అనుపమ చెప్పుకొచ్చింది. 'ఈ గోడ మీద కనిపిస్తున్న పెయింటింగ్స్ అన్నీ.. 2021లో నా లైఫ్‌లోనే అత్యంత కష్టమైన రోజుల్లో నేను వేసినవి.చిన్నప్పటి నుండి నాకు రంగులంటే చాలా ఇష్టం, కానీ పెయింటింగ్ వేయడం ఎలాగో నాకు అస్సలు తెలియదు. అయితే ఒకరోజు నేను పడుతున్న కష్టాల గురించి, నా బాధల గురించి సాయి పల్లవితో షేర్ చేసుకున్నాను. అప్పుడు ఆమె ఎంతో ప్రేమతో తన దగ్గరున్న వాటర్ కలర్స్ నాకు ఇచ్చింది. ఆమె చేసిన ఆ చిన్న సాయమే నేను పెయింటింగ్ స్టార్ట్ చేయడానికి కారణం అయింది.
నాలో ఇలాంటి ఒక టాలెంట్ ఉందనే విషయం నాకే తెలియదు. అలాంటి నాలోని కొత్త కోణాన్ని నాకు పరిచయం చేసినందుకు సాయి పల్లవికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. లవ్ యూ డార్లింగ్. ఇక అసలు విషయానికి వస్తే.. పోయిన సంవత్సరం మా క్యూట్ అమ్మ, నాన్న నేను వేసిన ఈ పెయింటింగ్స్ అన్నింటినీ నాకు తెలియకుండా సేకరించి, వాటన్నింటికీ చక్కగా ఫ్రేమ్స్ కట్టించి.. నా స్టూడియో గోడల నిండా తగిలించి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. నా జీవితంలోని ఒక చేదు జ్ఞాపకం.. ఈరోజు నా స్టూడియో గోడల మీద ఇంత అందమైన జ్ఞాపకాల ప్రపంచంగా మారింది. ఇది ఎంత స్వీట్‌గా ఉందో కదా' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన సాయిపల్లవి ఫ్యాన్స్.. అసలు ఐ ఇంత గొప్ప మనసు ఎలా సాయిపల్లవి.. మనిషివా.. దేవతవా నువ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Scam: సన్నీ లియోన్ సహా కష్టాల్లో కన్నడ తారలు!
Jaya bachchan: అంతా అయిపోయాక మాట్లాడి ప్రయోజనం ఏంటి?
Transfer Trimurthulu: వడ్డే నవీన్, రాశీ సింగ్‌తో స్పెషల్ చిట్ చాట్