రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ధురంధర్ 2 ’ థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ డిజిటల్
స్క్రీన్స్‌పై ఊహించని రేంజ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఓటీటీలోకి అడుగుపెట్టిన మొదటి వీకెండ్లోనే ఈ చిత్రం ఏకంగా 50 మిలియన్ల (5 కోట్ల) వ్యూయర్స్‌ను సొంతం చేసుకుని ఇండియన్ డిజిటల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ లాంచ్‌గా ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. థియేటర్లలో సాధించిన సంచలన విజయాన్ని మించి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ స్పై థ్రిల్లర్ సరికొత్త రికార్డుల వేటను కొనసాగిస్తోంది.* జార్జ్‌కుట్టి సరికొత్త మైండ్ గేమ్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’!కనెక్టెడ్ టీవీల హవాహిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం మెట్రో నగరాల నుండి చిన్న పట్టణాల వరకు ప్రతి ఒక్కరి వాచ్‌లిస్ట్‌లో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఈ డిజిటల్ ప్రీమియర్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా మొత్తం వాచ్ టైమ్‌లో దాదాపు 60 శాతం వ్యూస్ కేవలం కనెక్టెడ్ టీవీ పరికరాల ద్వారానే నమోదయ్యాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా పెద్ద స్క్రీన్లపై, కుటుంబసభ్యులంతా ఒకే దగ్గర కూర్చుని సినిమాను వీక్షించే ట్రెండ్ మళ్లీ పుంజుకుందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఈ భారీ సక్సెస్‌పై జియోస్టార్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ హెడ్ ఆలోక్ జైన్ స్పందిస్తూ.. "ధురంధర్ ది రివెంజ్’ చిత్రానికి లభించిన స్పందన అసాధారణం. ఓపెనింగ్ వీకెండ్లోనే 50 మిలియన్ల వ్యూయర్స్‌ను చేరుకోవడం అనేది ఈ కంటెంట్‌కు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. ఇందులో 60 శాతం వ్యూస్ కనెక్టెడ్ టీవీల ద్వారా రావడం దేశవ్యాప్తంగా ఇళ్లలో ప్రీమియం ఎంటర్టైన్మెంట్ను అందరూ కలిసి పెద్ద స్క్రీన్లపై ఆస్వాదిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇది ఓటీటీలో సరికొత్త అనుభూతిని ఇచ్చే కంటెంట్‌కు ఉన్న ఆదరణను తెలియజేస్తోంది" అని తెలిపారు.* ‘పెద్ది’ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. చరణ్ నటన చూసి గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిఈ గ్రాండ్ డిజిటల్ ప్రీమియర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు మేకర్స్ జోడించిన ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాతో పాటు నటీనటుల సరదా ముచ్చట్లు, ఇప్పటివరకు బయటకు రాని తెరవెనుక ఆసక్తికరమైన కథలు, బిహైండ్ ది సీన్స్ విశేషాలతో కూడిన 30 నిమిషాల ప్రత్యేక ప్రీ షోను సిద్ధం చేశారు. దీనివల్ల వీక్షకులు సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ని మించి....ఈ చిత్రం మొదటి భాగం 'ధురంధర్' రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించగా, ఇప్పుడు రెండో భాగం ఏకంగా 50 మిలియన్ల వ్యూస్‌తో ఆ రికార్డును తిరగరాసింది. ఈ గ్రాండ్ డిజిటల్ ప్రీమియర్‌కు ప్రకటనదారుల నుండి కూడా భారీ స్పందన లభించింది. ఏకంగా 50కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 13 భారీ స్పాన్సర్లు ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యారు. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్లతో రికార్డుల సునామీ సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది.