
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నప్పటికీ, దాని వెనుక పెను పర్యావరణ ముప్పు పొంచి ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా, చాట్‌జీపీటీ వంటి
'ఏఐ' సాధనాలు పనిచేయడానికి అవసరమైన డేటా సెంటర్లు ప్రతిరోజూ కోట్ల లీటర్ల మంచినీటిని వినియోగిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం, కేవలం చాట్‌జీపీటీ నిర్వహణ కోసమే రోజుకు సుమారు 148 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. ఒక చిన్న సమాధానం ఇవ్వడానికే ఒక వాటర్ బాటిల్ అంత నీరు ఖర్చవుతుంది.ఎందుకింత నీరు అవసరం?'ఏఐ' అప్లికేషన్లు పనిచేసే క్రమంలో వాటి సర్వర్లు విపరీతమైన ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఈ సర్వర్లను నిరంతరం చల్లబరచడానికి 'ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్'ను వినియోగిస్తారు. దీనికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది. ఇది ప్రత్యక్ష వినియోగం కాగా, ఈ డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిలోనూ పరోక్షంగా నీటి వినియోగం జరుగుతోంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు 2023లో చేపట్టిన అధ్యయనం ప్రకారం, చాట్‌జీపీటీలో 5 నుంచి 50 ప్రశ్నలకు సుమారు 100 పదాలలో సమాధానం పొందడానికి దాదాపు 519 మిల్లీలీటర్ల నీరు ఖర్చవుతోందని వెల్లడైంది.పెరుగుతున్న ఆందోళనలుఅమెరికాలో ఒక్క 2023లోనే డేటా సెంటర్లు 17 బిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించాయి. కొన్ని భారీ డేటా సెంటర్లు రోజుకు 5 మిలియన్ గ్యాలన్ల నీటిని వాడుతున్నాయి. ఇది ఒక చిన్న పట్టణం నీటి అవసరాలతో సమానం. 2030 నాటికి 'ఏఐ' సంబంధిత నీటి వినియోగం ట్రిలియన్ల లీటర్లకు చేరవచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది.ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో ఇప్పటికే