
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Allu Arjun Peddi Review: అల్లు అర్జున్ తాజాగా పెద్ది సినిమాను వీక్షించినట్లు తెలిపారు. సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. చరణ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడని, ప్రతి సన్నివేశంలో తన ముద్ర వేసాడని కొనియాడారు.
ప్రత్యేకంగా రామ్ చరణ్ శారీరక మార్పు, పాత్ర కోసం చేసిన కృషి, డ్యాన్స్ ప్రదర్శన గురించి అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. "చరణ్ నటన నిజంగా అద్భుతం. ప్రతి అంశంలోనూ అతను మెప్పించాడు. నా సోదరుడి విజయంపై చాలా గర్వంగా ఉంది. అతను అందుకుంటున్న ప్రశంసలకు పూర్తిగా అర్హుడు" అని ట్వీట్లో పేర్కొన్నారు.
అంతేకాకుండా సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు నటనను కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని తెలిపారు. హీరోయిన్ జాన్వీ కపూర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అందరికీ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానాను ప్రశంసిస్తూ, ప్రతి పాత్రను అద్భుతంగా చూపించారని అన్నారు. రామ్ చరణ్ పాత్రను మరింత ఉన్నత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు దర్శకుడికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
చివరగా పెద్ది చిత్ర బృందం మొత్తం అభినందనలకు అర్హులని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌తో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం మరోసారి ఈ ట్వీట్ ద్వారా బయటపడిందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం పెద్ది మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండగా, అల్లు అర్జున్ ప్రశంసలు సినిమాకు మరింత బలం చేకూర్చాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.