డైరెక్టర్ పూరీ జగన్నాథ్, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. తాజాగా చెన్నైలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా
నిర్వహించారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను కల్పిత కథతో కాకుండా నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు వెల్లడించారు.‘‘మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు అడుక్కునే వారిని చూసి వదిలేస్తాం. కానీ వారి వెనుక ఎన్నో తెలియని కథలు, గుండెలు పిండేసే బలమైన ఎమోషన్లు ఉంటాయి. అసలు వాళ్ల గతం ఏంటి? వాళ్లు నిజంగానే యాచకులా? అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది’’ అని పూరీ చెప్పారు. ఈ సినిమాను ఈ తరం ‘జెన్ జీ’ యువత కోసం ప్రత్యేకంగా తీశానని, వారు తమ కుటుంబాలతో కలిసి చూడాల్సిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని పేర్కొన్నారు.తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇందులో విజయ్ సేతుపతి ఒక అంధుడైన యాచకుడిగా కనిపించి షాక్ ఇచ్చారు. యాచకులను తక్కువ చేసి చూసే వారికి, వారిని వాడుకునే వారికి వార్నింగ్ ఇస్తూ సాగే డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అయితే విజయ్ సేతుపతి నిజంగానే అంధుడా.. లేక దాని వెనుక ఏదైనా పెద్ద రహస్యం ఉందా? అనే సస్పెన్స్‌తో టీజర్‌ను ముగించారు.ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు టబు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. సంయుక్త, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ