రామ్‌చరణ్- జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే
బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుని రికార్డుల వేట సాగిస్తోన్న ఈ చిత్రంపై సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరారు. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన బన్నీ.. సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఎమోషనల్ రివ్యూ ఇచ్చారు.* బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఊచకోత.. కేవలం 5 రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి మెగా ఎంట్రీరామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ.. "నా ప్రియమైన రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. రఫ్‌గా, సహజంగా కనిపించే పాత్రలో ఆయన చూపించిన నటన అసాధారణం. పాత్ర కోసం చేసిన శారీరక మార్పు, తెరపై చూపించిన ఎనర్జీ, అలాగే డ్యాన్స్‌లో కనబరిచిన గ్రేస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఆయన తన అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు. నా చరణ్ చూస్తుంటే నిజంగా ఎంతో గర్వంగా ఉంది. ఆయనకు లభిస్తోన్న ప్రశంసలకు రామ్‌చరణ్ పూర్తిగా అర్హుడే’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఈ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ గురించి ప్రస్తావిస్తూ.. జగ్గుభాయ్ (జగపతిబాబు)తో పాటు అందరూ అద్భుతంగా నటించారని, కథానాయిక జాన్వీ కపూర్‌కు తన ప్రేమాభిమానాలు తెలియజేస్తున్నానని బన్నీ పేర్కొన్నారు. ఈ ప్రయాణానికి సారథిగా నిలిచిన దర్శకుడు బుచ్చిబాబును ప్రత్యేకంగా అభినందిస్తూ.. ప్రతి పాత్రను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, రామ్ చరణ్‌ను మరింత గొప్ప స్థాయిలో ఆవిష్కరించారంటూ కొనియాడారు.* రూ.2,400 కోట్ల భారీ స్కామ్... చిక్కుల్లో పడ్డ సన్నీ లియోన్, కర్ణాటక సీఐడీ నోటీసులుబాక్సాఫీస్ వద్ద కేవలం 5 రోజుల్లోనే రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన చరణ్ సోలో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'పెద్ది' చిత్రానికి బన్నీ ఇచ్చిన ఈ సపోర్ట్ మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం 'రాకా' షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.