ధీరజ్‌పై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలంటే.. నువ్వు వాడ్ని వదిలేసి అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేయాలని కండిషన్ పెడుతుంది భద్రావతి. అయితే ధీరజ్ జైలులో కుమిలిపోవడం చూసిన ప్రేమ.. ఆ జైలు గదుల నుంచి
ధీరజ్‌కి విముక్తి కల్పించడానికి కఠిన నిర్ణయం తీసుకుంది. ఈరోజు (జూన్ 09) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి తరలిపోయిన ఘట్టాన్ని చూసి తరిద్దాం అంటూ తెగ మురిసిపోతుంది శ్రీవల్లి. ఇక ప్రేమ.. అత్తింటిని వీడి పుట్టింట్లో అడుగుపెడుతుంది. ఆ వెనుకే నర్మద, శ్రీవల్లిలు కూడా పరుగుతీస్తారు. భద్రావతికి ఎదురుగా వెళ్లిన ప్రేమ.. ‘అత్తా.. నేను వచ్చేశాను. నేను వాడ్ని వదిలి వచ్చేస్తే జైలు నుంచి విడిపిస్తానని చెప్పావ్ కదా.. అందుకే వచ్చేశాను.. నువ్వు చెప్పినట్టే ఇక నీతో పాటే ఉంటాను. మరి నీ మాటని నిలబెట్టుకుని ధీరజ్ని విడిపించు’ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో భద్రావతి ఆనందానికి అవధులు ఉండవు. రేయ్ విశ్వా.. రేయ్ సేనా.. మన ప్రేమ వచ్చేసింద్రా.. శాశ్వతంగా మన ఇంటికి వచ్చేసింది. ఆ ధీరజ్ గాడితో ఆ ఇంటితో పూర్తిగా తెగతెంపులు చేసుకుని వచ్చేసింద్రా’ అని సంబరపడిపోతుంది భద్రావతి.ఏయ్ రండ్రా.. రండీ.. నా మేనకోడలు వచ్చేసింద్రా.. ఇంతలో పెద్దావిడ శారదాంబ, తల్లి రేవతిలు వచ్చి.. ‘ఏయ్ ప్రేమా.. ఏంటే ఈ పిచ్చి పనీ.. తాళి కట్టిన భర్తని అత్తవారింటికి వదిలేసి రావడం ఏంటి? అర్థం లేకుండా.. మూడు ముళ్ల బంధాన్ని తెంచేసుకుంటావా? ముడిపడిన నూరేళ్ల బంధాన్ని కాదనకుంటావా? తప్పమ్మా తప్పు అని అంటారు. ‘అది ఉంటున్నదీ నూరేళ్లు బంధంలో కాదు. నరకంలో. కూతురు ఇంటికి వచ్చినందుకు సంతోషపడండి.. ఎందుకు వచ్చిందని పిచ్చి ప్రశ్నలు వేయొద్దు’ అని అంటుంది భద్రావతి. ఇక సేనాపతి కూతుర్ని తనివితీరా చూసుకుని మురిసిపోతాడు. తల్లీ.. వచ్చేశావా? నిజంగానే వచ్చేశావా? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా? అని.. ఎదురుచూస్తున్నా తల్లీ.. నాకు ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది. గుండె ఆనందంతో నిండిపోయింది’ అని ఎమోషనల్ అవుతాడు. నా గొంతులో ప్రాణం ఉండగా.. ఈ గుండెలపై ఉన్న తాళిని తీయలేవ్ అత్తా ఇక భద్రావతి.. ప్రేమ దగ్గరకు వచ్చి.. ‘వాడ్నిశాశ్వతంగా వదిలేసి వచ్చినప్పుడు.. వాడు కట్టిన తాళి ఎందుకు తీసి పారెయ్ అని తాళిని పట్టుకుంటుంది. అప్పుడు ప్రేమ.. భద్రావతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. పెద్దగా నవ్విన ప్రేమ.. ‘నా గొంతలో ప్రాణం ఉన్నంత వరకూ.. ఈ గుండెలపై ధీరజ్ కట్టిన తాళిని, గుండెల్లో ధీరజ్‌పై ఉన్న ప్రేమని దూరం చేయడం నీ వల్ల కాదు’ అంటూ ఇచ్చిపడేస్తుంది ప్రేమ. దెబ్బకి భద్రావతి ఆనందం కాస్తా ఆవిరైపోతుంది. నర్మద మొహం వెలిగిపోతుంది. ఏంటే వాడితో తెగతెంపులు చేసుకుని వచ్చేశానని అన్నావ్ కదా అని భద్రావతి తెల్లమొహం వేస్తుంది. అయ్యో పిచ్చి అత్తా నమ్మేశావా?? శాశ్వతంగా బంధాన్ని తెంచేసుకున్నానంటే నమ్మేశావా? నా భర్త కోసం యుద్దానికి దిగాను.. ఇక రణరంగమే.. ధీరజ్‌కి నాకు మధ్య ఉన్న ప్రేమ.. ఒకరికొకరు నచ్చడం కాదు. ఒకరికోసం ఒకరు బతకడం. చావైనా బతుకైనా వాడితోనే అనుకున్నా. మరి మధ్యలోనే వాడి చేయి వదిలివస్తానని ఎలా అనుకున్నారూ?? నేను వచ్చింది భయపడి కాదు.. హెచ్చరించడానికి వచ్చాను. మా బంధాన్ని మీరు ఎంత దూరం చేయాలని చూస్తే.. అంత బలపడుతుంది. మీకు కుట్రలు చేసి.. నా భర్తని అరెస్ట్ చేయించడం తెలిస్తే.. నాకు యుద్ధం చేసి నా భర్తని విడిపించుకోవడం తెలుసు. ఇప్పుడు ఆయుద్దానికే భయల్దేరతాను. సత్యభామలా పోరాడతాను. నా భర్తని నిర్దోషిగా బయటకు తీసుకుని వస్తాను’ అని శపథం చేస్తుంది.ఏయ్ తస్సాదియ్యా.. నర్మద విజిల్స్ ఆ డైలాగ్‌కి నర్మద పెద్దగా విజిల్ వేస్తూ.. సూపర్ ప్రేమా అంటూ చప్పట్లు కొడుతుంది. ఏయ్ సవాల్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? వాడ్ని బయటకు తీసుకుని రావడం అంటే.. తిరిగి తిరిగి మళ్లీ నా కాళ్ల దగ్గరకే వస్తావ్ అని అంటుంది భద్రావతి. ‘నేను నీ కాళ్ల దగ్గరకు రావడం కాదు.. నా భర్త రిలీజ్ అయ్యి ఇంటికి వస్తారు.. చూడ్డానికి రెడీగా ఉండండి’ అని అంటుంది ప్రేమ. ఇక నర్మద అందుకుని.. ‘మీరు రామరాజు కోడళ్లు అంటే ఏంటో చూస్తారు.. పిక్చర్ క్లియర్‌గా చూపిస్తాం.. పద ప్రేమా ’అంటూ ప్రేమని తీసుకుని వెళ్లిపోతుంది నర్మద. ప్రేమ ఇచ్చిన డోస్‌కి ఖంగు తింటుంది భద్రావతి.ఆలోపే మనం ఆ పని చేయాలి అక్కా.. ఇక నర్మద.. ప్రేమని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. నువ్వు నిజంగానే పుట్టింటికి వెళ్లిపోతావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా ప్రేమా అని అంటుంది. ‘ఎన్ని జన్మలు ఎత్తినా.. ధీరజ్ అంత ప్రేమించే భర్త నాకు దొరకడు. అంత ప్రాణంగా కళ్లల్లో పెట్టుకుని చూసుకుని భర్తని వదిలేసి ఎందుకు వదిలేసి వెళ్లిపోతాను’ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో నర్మద.. ధీరజ్‌పై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. ఆ ప్రేమతోనే ఈ కేసు నుంచి ధీరజ్ని బయటకు తీసుకుని రావడం కోసం పిచ్చి పని చేస్తావేమోనని భయపడ్డాను’ అని అంటుంది నర్మద. ‘లేదక్కా.. ఇంకొన్ని గంటల్లో ధీరజ్ని స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకుని వెళ్తారు. ఈలోపే ఏదోటి చేయాలి అక్కా’ అని అంటుంది ప్రేమ. బెయిల్ రావడం కష్టం.. దానికి ఒక్కటే దారి ఇందాక మీ అత్తతో చెప్పాను కదా.. రామరాజు గారి కోడళ్ల పవర్ ఏంటో చూస్తారని.. ఆ పవర్ చూపిద్దాం.. ధీరజ్ని బయటకు తీసుకుని వద్దాం పదా అని అంటుంది నర్మద. వెంటనే లాయర్‌కి కాల్ చేస్తుంది నర్మద. బెయిల్ రావడం కష్టం అని లాయర్ చెప్పడంతో ఖంగుతింటారు నర్మద ప్రేమలు. ఆధారాలు బలంగా ఉన్నాయి.. ధీరజ్‌కి ఈ కేసుతో సంబంధం లేదు.. ఆ మారక ద్రవ్యాలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని మనం పక్కా ఆధారాలు సమర్పిస్తేనే బెయిల్ వస్తుంది.. లేదంటే బెయిల్ రావడం కష్టం అని అంటాడు లాయర్. దాంతో ప్రేమ.. ధీరజ్ కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా శిక్ష పడి జైలుకి వెళ్తాడు. వాడి జీవితం నాశనం అయిపోతుంది. అందుకే ఈలోపే మనం బయటకు తీసుకుని రావాలి అక్కా’ అని అంటుంది ప్రేమ. పదా ఆ ప్లేస్‌కే వెళ్దాం.. ఆ దేవుడే దారి చూపిస్తాడు టెన్షన్ పడొద్దు ప్రేమా.. లాయర్ గారు ఒక మాట అన్నారు విన్నావ్ కదా.. ధీరజ్ ఎలాంటి నేరం చేయలేదని బలమైన ఆధారాలు ఉంటే.. ధీరజ్ని బయటకు తీసుకుని రావొచ్చని అన్నారు.. ఆయన చెప్పింది కరెక్టే కానీ.. ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు ఎలా వస్తాయి? అని అంటుంది నర్మద. అప్పుడు ప్రేమ.. ‘ఏ ప్లేస్‌లో అయితే వాడు మారకద్రవ్యాలుపెట్టాడో.. అదే ప్లేస్ నుంచి అంక్వైరీ మొదలుపెడదాం.. ఆ దేవుడే ఏదొక దారి చూపిస్తాడు.. పదక్కా పదా’ అని నర్మదని తీసుకుని వెళ్తుంది ప్రేమ. అయితే ఇదంతా విన్న శ్రీవల్లి పెద్దగా నవ్వుతూ.. ‘నేరం చేసిన వాళ్లు అక్కడే ఉంటారా ఏంటీ.. వీళ్లకి దొరికిపోవడానికి’ అని అంటుంది. ఈ సుక్కూ వెళ్లి వాళ్లపై రెండు కళ్లేస్తుందని వాళ్ల వెనుకే వెళ్తుంది సుకన్య. అదిగో ఆధారం.. ఇక నర్మద, ప్రేమలు.. ధీరజ్ని పోలీసులు పట్టుకున్న ప్లేస్‌కి వెళ్తారు. కామెడీగా.. రోడ్డున వెళ్లే వాళ్లని అడుగుతుంది ప్రేమ. ఇలా అడిగితే ఎవరు చెప్తారు ప్రేమా?? ప్లాన్ ప్రకారం ధీరజ్ని ఇరికించారు. మారకద్రవ్యాలు ఉన్న మామిడికాయల బాక్స్ పెట్టిన వాడు దొరికితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ముందు వాడ్ని పట్టుకోవాలి.. ఈ ఏరియాలో సీసీ కెమెరాలో ఉంటే.. వాడు ఎవడో తెలిసిపోతుంది అంటూ చుట్టూ వెతుకుతారు. అక్కడ ఓ కిరాణా షాప్‌లో ఒక సీసీ కెమెరా ఉండటంతో.. ఆ షాప్ వాడి దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తారు. అన్యాయంగా మా ఆయన్ని అరెస్ట్ చేశారు.. మీరు సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తే.. ఆ కేసు నుంచి బయట పడొచ్చు దయచేసి సాయం చేయమని బ్రతిమిలాడతారు నర్మద, ప్రేమలు. మర్యాదగా ఫుటేజ్ ఇస్తావా? చస్తావా?? అడగ్గానే ఇవ్వడానికి అదేమైనా ప్రింటౌట్ కాదు.. ఫుటేజ్. ఎవరికి పడితే వాళ్లకి ఎందుకు ఇస్తాం.. కుదరదు అస్సలు కుదరదు అని అంటాడు కిరాణా షాప్ వాడు. దాంతో నర్మద.. మర్యాదగా ఫుటేజ్ ఇస్తారా లేదా? అని బెదిరిస్తుంది. ఏంటీ.. బెదిరిస్తున్నారూ.. పోలీసులకు ఫోన్ చేస్తాను అని అంటాడు కిరాణా షాప్ వాడు. దాంతో నర్మద.. గేర్ మార్చుతుంది. ‘ఫోన్ చేస్తావా చెయ్.. మర్యాదగా ఫుటేజ్ ఇచ్చావా సరేసరి లేదంటే.. తలపగిపోద్ది అంటూ పెద్ద సీసా పైకి ఎత్తేస్తుంది. దాంతో ఆ షాప్ వాడు భయపడిపోయి.. సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తుంటాడు. పట్టేసిందిగా.. ఆ నెంబర్ ట్రాఫిక్ ఎస్ఐకి ఇలా మెల్లగా ఎప్పటికి చూపిస్తారు.. మాకంత టైమ్ లేదు అంటూ వాడ్ని పక్కకి నెట్టేసి.. ఫుటేజ్ చూస్తుంది నర్మద. అందులో ధీరజ్ని కేసులో ఇరికించిన వాడు క్లియర్‌గా కనిపిస్తాడు. వెంటనే ఆ ఫుటేజ్ మొత్తాన్ని ఫోన్లో రికార్డ్ చేస్తుంది నర్మద. ఈ బండి నెంబర్ ఆధారంగా వాడు ఎవడో పట్టుకోవచ్చు. నాకు తెలిసిన ట్రాఫిక్ ఎస్ఐకి ఈ నెంబర్ పంపించి వాడి అడ్రస్ కనుక్కుంటాను అని ట్రాఫిక్ ఎస్ఐకి కాల్ చేస్తుంది నర్మద. పది నిమిషాల్లో వాడి వివరాలు పంపిస్తా అని అంటాడ ఎస్ఐ. అయితే ఇదంతా సుకన్య కంట్లో పడుతుంది. వీళ్లకి సీసీ టీవీ ఫుటేజ్ దొరికేసింది.. ఈ విషయం అర్జెంట్‌గా అత్తయ్యకి చెప్పకపోతే కొంపలు అంటుకునేట్టు ఉన్నాయ్ అంటూ పరుగుతీస్తుంది. మరోవైపు కొడుకు కోసం కుమిలికుమిలి ఏడుస్తుంటుంది వేదవతి.