
Poonam pandey emotional on trolling: ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు అయ్యిందని చెబుతూ నటి పూనమ్ పాండె ఎమోషనల్ అయ్యారు.
అంతే కాకుండా చాలా బాధలో ఉన్నానని దయచేసి వేధించవద్దని రిక్వెస్ట్ చేస్తు వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
ఇటీవల కొంత మంది నెటిజన్లు సెలబ్రీటీలు, ఫెమస్ పర్సనాలిటీస్ లను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలపై ట్రోల్స్, మీమ్స్, బూతులు తిడుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్ లలో కొంత మంది ట్రోలర్స్ కు కౌంటర్ ఇస్తుండగా, మరికొంత మంది తమకు ఎందుకులే అని సైలెంట్ గా ఉంటున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ నటి పూనమ్ పాండె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాంట్రవర్సీగా కేరాఫ్ అని చెప్పుకొవచ్చు. ఈ భామ బోల్డ్ సినిమాల్లో నటించింది. గతంలో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే ఒంటిపై నూలు పొగులేకుండా మైదానంలో నడుస్తానని చెప్పింది. చెప్పినట్లే వాంఖడే మైదానంలో నగ్నంగా నడిచి అందరిని షాక్ కు గురిచేంది.
గతంలో ఒకసారి తనకు గర్భాశయ క్యాన్సర్ సోకిందని పోస్ట్ పెట్టడమే కాకుండా చనిపోయినట్లు తనకు తానే ఇన్ స్టాలో పొస్ట్ పెట్టుకుంది. దీన్ని అందరు నిజం అనుకుని నమ్మసరికి.. ట్విస్ట్ ఇచ్చింది.తాను చనిపోలేదని గర్భాశయ క్యాన్సర్ పై అందరికి అవగాహక కల్గాలని ఈవిధంగా చేసినట్లు చెప్పింది. దీంతో తరచుగా పూనమ్ పాండె అనేక కాంట్రవర్సీలు చేస్తు వార్తలలో ఉంటునే ఉంది.
దీంతో నటి పూనమ్ పాండెను తరచుగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు . కొంత మంది ఈమె బోల్డ్ నటనపై కూడా బూతులు తిడుతూ కామెంట్స్ పెడుతారు. తాజాగా.. పూనమ్ పాండె తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ట్రోల్స్, నెటిజన్ల బూతులపై ఎమోషనల్ అయ్యారు . తాను కూడా ఒక మనిషిని అని దయచేసి తిట్టొద్దని రిక్వెస్ట్ చేశారు.
ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు అయ్యిందని అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నట్లు చెప్పింది. చాలా బాధలో ఉన్నానని, తన గతంను తెలుసుకొకుండా ట్రోల్స్ చేయోద్దని వేడుకుంది. సినిమాల్లో, తనకు వచ్చిన అవకాశాల్లో ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్డపడుతున్నానని నటి పూనమ్ పాండె చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్రోల్స్ లను, బూతుల్ని భరించలేకపోతున్నానని చెబుతూ పూనమ్ పాండె ఎమోషనల్ వీడియోన తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇక పూనమ్ పాండే హింది, భోజ్ పూరీ , టాలీవుడ్ లో కూడా నటించింది. నషా అనే మూవీలో ఒక విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న టీచర్ పాత్రపై కూడా గతంలో వివాదం రాజుకుంది.తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీ చేసింది. 2020 సెప్టెంబర్ 1న సామ్ బాంబేను కరోన సమయంలో చాలా సింపుల్గా పెళ్లాడింది పూనమ్. ఆ తర్వాత పది రోజులకే భర్తపై వేధింపులు, అత్యాచారం మొదలైన కేసులు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి బైటకు రాగానే మరల భర్తతో కలసి జీవనం సాగించడం అందర్నిషాక్ కు గురిచేసింది. ఆ తర్వాత పూనమ్ పాండే గోవా ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియోకు తీసినందుకు గాను పొర్నొగ్రఫి కేసులో ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.