
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. నేడు జూన్ 9వ తేదీ మంగళవారం కూడా ధరలు భారీగా పతనం అయ్యాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,428 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1, 36,975 పలుకుతోంది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనం అవుతున్నాయి. ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం రూ. 4330 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రపంచ మార్కెట్లలో బలహీనత, పెరుగుతున్న ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య రాజధాని ఢిల్లీలో సోమవారం 10 గ్రాముల బంగారం ధరలు రూ. 1,100 మేర తగ్గి రూ. 1,49,428 కు చేరాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడి స్థానిక పన్ను రేట్ల వల్ల ధరలు కాస్త అటు ఇటుగా మారే అవకాశం ఉంది. ఇక స్థానిక బులియన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర, శుక్రవారం ముగింపు ధర అయిన రూ. 1,59,900 తో పోలిస్తే రూ. 1,100 మేర తగ్గి 10 గ్రాములకు రూ. 1,49,428 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర దాదాపు ఒక శాతం తగ్గి ఔన్సుకు $4330కు చేరింది.
స్పాట్ డిమాండ్‌లో బలహీనత నేపథ్యంలో, సోమవారం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 2,374 మేర తగ్గి రూ. 1,53,220కి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఆగస్టు డెలివరీకి సంబంధించిన గోల్డ్ కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 2,374 లేదా 1.53 శాతం తగ్గి రూ. 1,53,220కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు 0.96 శాతం తగ్గి $ 4,286.81కి చేరింది. బలహీనమైన ప్రపంచ సంకేతాల కారణంగానే బంగారం ధరలు తగ్గాయని నిపుణులు తెలిపారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, విలువైన లోహాల ధరల పతనం ఇటీవలి బలహీనతకు కొనసాగింపు మాత్రమే అంటున్నారు. పెట్టుబడిదారులు ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల కంటే, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అమెరికాలో ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక గణాంకాలు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలను పెంచాయని చెబుతున్నారు. దీని కారణంగా, బంగారం, వెండి వంటి సురక్షితమైన పెట్టుబడి ఎంపికల పట్ల ఆకర్షణ తగ్గిందని పేర్కొంటున్నారు. పశ్చిమ ఆసియా, ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఇటీవలి సంఘటనలు కూడా మార్కెట్లో అస్థిరతను పెంచాయని, ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని చెబుతున్నారు. అటు జూన్ 9వ తేదీ మంగళవారం కూడా వెండి ధర భారీగా దిగివచ్చింది. సోమవారంతో పోల్చిచూస్తే వెండి ధర భారీగా తగ్గినట్లు మనం గమనించవచ్చు. కిలో వెండి ధర రూ. 2,46,224 పలుకుతోంది. వెండి ధర మార్కెట్లో తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడమే అని చెప్పాలి. గత 10 ట్రేడింగ్ సెషన్లను గమనిస్తే వెండి ధర దాదాపు 15వేల రూపాయలు తగ్గింది. ఒక దశలో వెండి ధర రూ. 2.65 లక్షలకు వరకు కూడా వెళ్లింది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.