
Midday Meal Workers Protest: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘డొక్కా సీతమ్మ బడి భోజనం’ (మధ్యాహ్న భోజన పథకం) విధానాన్ని మార్చి.. కార్పొరేట్ సంస్థల లాభాల కోసం
ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘స్మార్ట్ కిచెన్’ (Smart Kitchens) పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తి దినం (గ్రీవెన్స్ డే) సందర్భంగా.. వందలాది మంది కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించి, జిల్లా కలెక్టర్ ఇమాన్షు శుక్లాకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.
Read also: AP Rajya Sabha Nominations: నామినేషన్లు దాఖలు చేసిన కూటమి రాజ్యసభ అభ్యర్థులు
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర/జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నమ్ముకుని అత్యంత తక్కువ వేతనాలతో, ఎండనక వాననక కోట్లాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన వంట వండి పెడుతూ వేలాది మంది పేద, ఒంటరి మహిళలు జీవనోపాధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తెస్తున్న స్మార్ట్ కిచెన్ల విధానం వల్ల కేంద్రీకృత వంటశాలలు ఏర్పడి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న నిర్వాహకులు, ఆయా కుటుంబాల వారు పూర్తిగా రోడ్డున పడి నిరాశ్రయులవుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకు ఈ రంగాన్ని ధారాదత్తం చేయొద్దని హెచ్చరించారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల మనుగడను కాపాడేందుకు సంఘం ప్రతినిధులు కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు:
ఈ నిరసన ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటించిన జిల్లా సీఐటీయూ (CITU) ప్రధాన కార్యదర్శి రెహనా బేగం, సంఘం అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ.. మహిళా కార్మికులకు కనీస హక్కులను వర్తింపజేయకుండా వారి పొట్టగొట్టేలా స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం దుర్మార్గమన్నారు. కలెక్టర్ ఇమాన్షు శుక్లా సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యల తీవ్రతను, కార్మికుల వినతిని ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రజా విజ్ఞప్తి నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన మధ్యాహ్న భోజన కార్మికులు, మహిళలు, సీఐటీయూ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Srisailam Silver Nagabharanam:తెలంగాణ భక్తుల ప్రత్యేక కానుక!
Nellore PGRS Grievance:సత్వరమే భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Challapalli Veerayya Choudhary:ప్రజల జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాలి!
Bihar Accident Nellore Pilgrims:బీహార్ ప్రమాద బాధితులకు ప్రత్యేక విమానం:ఆనం
YCP : మాజీ సైనికులతో ప్రత్యేక వింగ్ ఏర్పాటు- సజ్జల
Vizag Steel Plant Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి