
KCR – Sridhar : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ సంస్థ (HYDRAA – హైడ్రా) కూల్చివేతలపై బెంగళూరులో జరిగిన ‘ది హిందూ హడిల్’ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన
‘హిట్లర్’ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిఎం రేవంత్‌ను నియంతగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించగా, దీనిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో కనీసం అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. చెరువులు, నాలాలు ఆక్రమించిన పెద్దలపై కఠినంగా ఉంటామనే కోణంలోనే ఆ వ్యాఖ్యలు వచ్చాయని, దాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదని హితవు పలికారు.
Read Also : చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి : సీపీ సజ్జనార్
తమది అంబేడ్కర్, గాంధీజీ మార్గమంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ లా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం నడిచిందని ఆరోపించారు. తానే స్వయంగా ‘హిట్లర్ కంటే కఠినంగా ఉంటా’ అని గతంలో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ లోపల, బయట మాట్లాడిన పాత వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాకు ప్రదర్శిస్తూ కౌంటర్ అటాక్ చేశారు. నాడు మీ తండ్రి స్వయంగా తానే హిట్లర్‌నని ప్రకటించుకున్నప్పుడు లేని నియంతృత్వం, నేడు ప్రజాధనాన్ని, ప్రకృతిని రక్షించేందుకు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయాలు తీసుకుంటే గుర్తొచ్చిందా అంటూ బీఆర్ఎస్ నేతలను శ్రీధర్ బాబు గట్టిగా నిలదీశారు.
Diabetes: షుగర్ లెవెల్స్ పెరిగితే వచ్చే వ్యాధులు ఇవే!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Indiramma Housing Scheme : నాలుగైదు రోజుల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి
Telangana Weather Update: తెలంగాణ లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు..ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Ramu Nayak Suspended: భూ స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్లు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెండ్!
Mahabubnagar Paddy Procurement:అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్!
Ramchander Rao: ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరడం అవాస్తవం: రాంచందర్ రావు
Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి : సీపీ సజ్జనార్