
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం నిర్వహించిన 'మీ భూమి - మీ హక్కు' సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. 2027 నాటికి రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి, ప్రతి రైతు
చేతిలో తప్పులు లేని పట్టాదారు పాస్‌బుక్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పచ్చని గోదావరి జిల్లాల్లో సైతం భూవివాదాలకు ఆజ్యం పోశారని ఆయన ఆరోపించారు. రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.2027 నాటికి భూ రికార్డుల ప్రక్షాళనగత ప్రభుత్వ నిర్వాకాల వల్ల భూ రికార్డులు పూర్తిగా తారుమారయ్యాయని, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కీలక సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి ప్రమాదకరమైన చట్టాన్ని రద్దు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం జారీ చేస్తున్న పట్టాదారు పాస్‌బుక్‌లకు కరెన్సీ నోట్ల తరహాలో క్యూఆర్ కోడ్‌తో పాటు అత్యంత పటిష్ఠమైన భద్రతా ఫీచర్లను పొందుపరిచామని వివరించారు. రికార్డుల ప్రక్షాళన ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని, గత పాలకులు సృష్టించిన గందరగోళాన్ని సరిదిద్దడానికి సుమారు మూడేళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు. 2027 నాటికి రాష్ట్రంలోని ప్రతి రైతుకు కచ్చితమైన, వివాదరహితమైన పాస్‌బుక్ అందించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు.రెవెన్యూ శాఖలో సమూల