
AP Rajya Sabha Nominations: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి పెరిగింది. తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున ఎంపికైన అభ్యర్థులు సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ సోమవారం తమ నామినేషన్ పత్రాలను
సమర్పించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో ఉన్న రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కలిసి వీరు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియకు ముందు అభ్యర్థులంతా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, అక్కడ ఉన్న దివంగత నేత నందమూరి తారకరామారావు (NTR) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read also: Chandrababu Naidu: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసి, బీ-ఫారాలను అందజేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన కాకినాడ నేత సానా సతీష్‌కు పార్టీ మరోసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పించింది. ఇక విద్యావేత్తగా పేరుపొంది, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణకు ఈసారి స్థానం దక్కింది. అలాగే, గత ఎన్నికల్లో లోక్‌సభ సీటు ఆశించినప్పటికీ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, యువ నేత చింతకాయల విజయ్ను చంద్రబాబు ఎంపిక చేశారు.
మరోవైపు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షమైన జనసేన తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా తన రాజ్యసభ నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే, టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) విమర్శలు గుప్పించింది. జూన్ 18న ఈ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత అసెంబ్లీలో అధికార ఎన్డీఏ కూటమికి ఉన్న తిరుగులేని సంఖ్యాబలం దృష్ట్యా, అభ్యర్థులందరి విజయం కేవలం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Chandrababu Naidu: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం
Gooty Petrol Bunk: గుత్తిలో రూ. 95 లక్షలతో పెట్రోల్ బంక్ శంకుస్థాపన చేసిన ఎస్పీ!
Kalyandurg SBI Pensioners: పెన్షనర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి
Operation H-FAST: హైదరాబాద్ టు ఏపీ వందల టన్నుల చికెన్ వ్యర్థాలు సీజ్!
Penuganchiprolu Attack : పెనుగంచిప్రోలులో ఘోరం: దైవదర్శనానికి వచ్చిన భక్తులపై కత్తులతో దాడి