
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog - 33 Temple Road). ఈ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. ‘‘ఒక్క వాన
పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా’’ అంటూ హీరో ఇచ్చే ఎంట్రీ, యాక్షన్, నేపథ్య సంగీతం అలరించేలా ఉన్నాయి. టీజర్లో పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. సంయుక్త, టబు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వార్త చదివారా: ‘ఇలా చేస్తే.. ఏ సినిమా అయినా హిట్ కావాల్సిందే: రామ్‌చరణ్