
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Revanth reddy govt good news to self help group women: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా మహిళల్ని అన్ని రంగాల్లో బలోపేతం దిశగా ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కోటి మందిమహిళల్ని కోటిశ్వరుల్ని చేయాలని కార్యచరణతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలపర్చాలని టార్గెట్ తో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేశారు. రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు భారీ కార్యక్రమం చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు.
మహిళా సాధికారతలో తెలంగాణ మరో మైలురాయికి శ్రీకారం చుట్టుందేకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిపోయిది. దేశంలోనే అతిపెద్ద స్థాయిలో మహిళలకు బస్సుల పంపిణీని ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా SHG మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వడ్డీ లేని రుణాలు, స్త్రీనిధితో మహిళలకు చేయూత అందించనున్నారు. మహిళా సంఘాల నిర్వహణలో క్యాంటీన్లు, పెట్రోల్ బంకులను నిర్వహించనున్నారు. ముఖ్యంగా రేపు వేలాదిగా మహిళల రాకతో పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు.
Read more: kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి హిట్లర్, తాలిబన్ల కంటే డెంజర్.!. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..
సీటింగ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యుల భారీ తరలించనున్నారు. ఈ కార్యక్రమంపై మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారతలో తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యమని సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.