
‘మహానటి’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సింప్లిసిటీతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు. లెజెండరీ
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై రూపొందిన సరికొత్త చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న (జూన్ 7న) చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నాగ్ అశ్విన్ వినమ్రత ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వంటి సీనియర్ ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ స్టేజ్‌పై కుర్చీలు వేసినప్పటికీ, నాగ్ అశ్విన్ మాత్రం పెద్దలపై ఉన్న గౌరవంతో నేలపైనే కూర్చున్నారు. అంతేకాకుండా, తను మాట్లాడటానికి మైక్ తీసుకునే ముందు స్టేజ్‌పై ఉన్న సింగీతం శ్రీనివాసరావు కాళ్లను తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఇంత వినమ్రతను ప్రదర్శించడం చూసి అక్కడికి వచ్చిన వారంతా ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఒక అద్భుతమైన ప్రయోగంఈ సందర్భంగా నాగ్ అశ్విన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఇది ప్రేక్షకులు ఒక వారంలో మర్చిపోయే సినిమా కాదు. రాబోయే పదేళ్ల వరకు గుర్తుంచుకునేలా ‘సింగీతం’ ఈ మ్యూజికల్ ఫాంటసీని తెరకెక్కించారు. ఈ సినిమాలో సాధారణ డైలాగులు ఉండవు, ప్రతి ఒక్క మాట పాటల రూపంలోనే