
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు
సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.
Nani The Paradise:సాధారణంగా నాని తన సినిమాలను ప్రకటించిన తేదీకే విడుదల చేయడానికి ప్రయత్నిస్తాడు. టాలీవుడ్లో విడుదల తేదీల విషయంలో మాట నిలబెట్టుకునే హీరోగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఈసారి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్‌పై పూర్తి నమ్మకం ఉంచి షూటింగ్‌ను తొందరపెట్టకుండా ముందుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.
అయితే సినిమా షూటింగ్లో ఇంకా కొంత భాగం మిగిలి ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా భారీ స్థాయిలో ఉండటం వల్ల ఆగస్టు 21 రిలీజ్ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘అయ్యా షేర్’ పాటకు మంచి స్పందన వచ్చినప్పటికీ, తర్వాత పెద్దగా అప్డేట్లు రాలేదు.
ఇదిలా ఉండగా, మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న *‘ఇరుముడి’* కూడా ఆగస్టు 21న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ది పారడైజ్’ టీమ్ మరో తేదీని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమా యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉంది. దసరా సెలవులను లక్ష్యంగా పెట్టుకుని సినిమాను సిద్ధం చేయగలరా లేదా అన్నది త్వరలో తేలనుంది. ఒకవేళ దసరా రిలీజ్ సాధ్యం కాకపోతే, సినిమా నేరుగా డిసెంబర్‌కు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అంశంపై అధికారిక ప్రకటన ఈ వారం వచ్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం నాని అభిమానులందరి ఆశలు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై ఉన్నాయి. ఆయన అనుకున్న స్థాయిలో సినిమాను పూర్తి చేసి త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరి ది ప్యారడైజ్ దసరా బరిలోకి వస్తుందా? లేక డిసెంబర్‌కు వాయిదా పడుతుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను
తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.