పోలీస్ లాకప్‌లో ఉన్న ధీరజ్ని కలవడానికి వెళ్తుంది ప్రేమ. ఈ టైమ్‌లో ఎందుకు వచ్చావ్ ప్రేమా అని ఎమోషనల్ అవుతాడు ధీరజ్. ‘నేను ఇంట్లో ఉన్నా నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉందిరా.. నీ గురించే ఆలోచిస్తుంది. నీ
గురించే ఏడుస్తుంది. ఈ బాధను భరించలేకపోతున్నాను.. ఊపిరి పీల్చుకుంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. నా ప్రాణమే నువ్వైనప్పుడు నువ్వు తినకుండా ఉంటే ఈ ప్రాణం ఎలా ప్రశాంతంగా ఉంటుందిరా.. రా కూర్చో తిను’ అని అంటుంది ప్రేమ. ‘లేదు ప్రేమా.. నాకు ఆకలిగా లేదు.. తినాలని కూడా లేదు’ అని అంటాడు ధీరజ్. నా కోసమైనా తినరా.. నా గుండె భారాన్ని ఇంకా పెంచకు.. భరించడం నా వల్ల కాదు.. ప్లీజ్ రా.. తినరా’ అని కూర్చోబెట్టి.. ధీరజ్‌కి తినిపిస్తుంది ప్రేమ. ఈ లాకప్‌లో ప్యాకప్ భోజనం అనే కాన్సెప్ట్ ఏదైతో ఉందో మామూలుగా లేదు మరి. ‘నా ఊపిరాగినా.. ఉసురుపోయినా.. వదిలిపోననీ’ అంటూ సాంగ్ వేసుకుంటారు. ‘నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదరా.. నీకు ఈ కష్టాలన్నీ.. నన్ను పెళ్లి చేసుకున్నావనే కోపంతోనే మా వాళ్లు నీపై పగ పెంచుకున్నారూ’ అని ఎమోషనల్ అవుతుంది ప్రేమ.మొదటిది అనుకోకుండా ముడిపడితే.. రెండోది మనసుతో ముడిపడింది ‘లేదు ప్రేమా.. నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే.. నా లైఫ్‌కి అర్థమే లేదు. మనం ఎవరితో కలిసి ఉండాలో.. ముడిపెట్టేది పెళ్లి.. ఎవరు లేకుంటే మనం బతకలేం అని చెప్తుందో అది ప్రేమ. మన జీవితాల్లో మొదటిది అనుకోకుండా ముడిపడింది. కానీ రెండోది మాత్రం మనసుతో ముడిపడింది. నీకోసం ఇదేంటే.. ఇంతకంటే పెద్ద కష్టం వచ్చినా సరే ఆనందంగా భరిస్తాను. కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉంటే మాత్రం దాన్ని భరించడం నాకు చాలా కష్టం’ అంటూ ప్రేమ చేతిలో ప్లేట్ తీసుకుని ప్రేమగా ప్రేమకి తినిపిస్తాడు ధీరజ్. నీకో ముద్దా.. నాకో ముద్దా.. ఎంత ముద్దుగా ఉందో నాపై ఎంత ప్రేమ ఉందో నీ కళ్లలో కనిపిస్తుంది. నాకు ఇంతకంటే ఏం కావాలే రాక్షసి.. నీ కంట్లో నీళ్లు అంటూ వస్తే.. సంతోషంతోనే రావాలి.. బాధతో అస్సలు రాకూడదు అంటూ ప్రేమ కురిపిస్తాడు ధీరజ్. ఇక ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడి తినిపించుకుంటారండోయ్.. మరి సీరియల్ రాజ్యాంగ సూత్రం ప్రకారం.. ఎవరికైనా తినిపిస్తే పొరమారాలి కదా.. అదే అవుతుంది. ప్రేమకి పొరమారుతుంది. ధీరజ్ తలపై బాది.. నీళ్లు తాగిస్తాడు. ఆ తరువాత ఇంకేముంది ‘వస్తానులే ప్రియ.. వందేళ్ల ప్రేమ బంధాలు పంపించి’ అని సాంగూ.మరిది జైల్లో ఉంటే దున్నపోతులా తిని డాన్స్‌లు చేస్తుందంటారే.. ఇక శ్రీవల్లి అయితే.. గాల్లో తేలినట్టుందే అంటూ ఫుల్ ఖుషీలో ఉంటుంది. ఆ దేవుడు ఉన్నాడూ.. ఉన్నాడూ.. నా కడుపు నాటకం ఎక్కడ నాటకం భయపడి చస్తుంటే.. కరెక్ట్ టైమ్‌కి ఆ ధీరజ్ గాడు అరెస్ట్ అయ్యాడు. ఆ ప్రేమని కుమిలికుమిలి ఏడ్చేలా చేశాడు దేవుడు. ఆ భద్రావతి ప్రేమని ఇంటికి తీసుకునిపోతానని అనేట్టు చేశారు. ఈ దెబ్బతో ప్రేమ దరిద్రం వదిలిపోయినట్టే’ అంటూ తెగ డాన్స్‌లు చేస్తుంటుంది శ్రీవల్లి. ఇదిగో నువ్వు ఇలా డాన్స్‌లు చేయడం.. తినడం ఎవరైనా చూశారనుకో.. మరిది జైలులో ఉంటే ఆ బాధ కొంచెం కూడా లేకుండా.. దున్నపోతులా తింటుందేనని దెయ్యం వదిలేలా కొడతారు అని అంటుంది సుకన్య. ఒడియమ్మా.. ఏమైనా తిప్పేందా ప్లేటూ.. వాయించిందిగా ప్లూటూ ఇంతలో పెద్దోడు చందు రానే వస్తాడు. వెంటనే ప్లేట్ తిప్పేస్తుంది శ్రీవల్లి. ‘ఎట్టా తినగలను.. మరిదిగారు జైలులో ఉన్నారనే బాధ నా గుండెల నిండా ఉంటే.. నాకు తిండి ఎలా సహిస్తుంది అని డ్రామా షురూ చేస్తుంది. ‘తినాలి వల్లీ తినాలి.. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డకోసమైనా తినాలి.. అని అంటుంది సుకన్య. ‘చూడు బావా.. నన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో.. నా బిడ్డ లాంటి మరిదిగారు అరెస్టింగ్ అయితే నా కొడుపులో బిడ్డ కోసం ఎట్టా తినగలను’ అని తెగ నటించేస్తుంది శ్రీవల్లి. అయితే చందు మాత్రం.. ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. నేను తట్టుకోలేకపోతున్నానండీ.. అక్కడ ధీరజ్‌కి ప్రేమ తినిపించే కార్యక్రమం ముగియగా.. ఇక్కడ కొడుకుపై బెంగతో తినడం మానేస్తుంది వేదవతి. దాంతో రామరాజు ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి వేదవతిని తినమంటాడు. మీరు తినలేదు కదా.. మీకు బాధ ఉందని మీరు తినడం మానేశారు.. మీకు సహించని తిండి నాకెలా సహిస్తుందండీ అంటూ వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో రామరాజు నువ్వు ఒక్క ముద్ద కూడా తినలేదు.. చిన్నోడికి ఏం కాదు.. నేను ఉన్నాను కదా అని అంటాడు రామరాజు. ‘ఏవండీ వాడు అమాయకుడండీ.. వాడ్ని ఈ కేసులో కావాలనే ఇరికించారండీ.. ప్రాణంపోయినా వాడు తప్పు చేయడు. నేను భరించలేకపోతున్నానండీ.. వాడ్ని ఏదో విధంగా బయటకు తీసుకుని రండీ’ అని భోరునవిలపిస్తుంది వేదవతి. అమ్మ జాగ్రత్తరా పెద్దోడు.. స్పాట్ పెట్టేసిన రామరాజు ఇంతలో చందు రావడంతో.. ‘రేయ్ పెద్దోడా.. ఎంఎల్ఏ గారితో మాట్లాడతా అన్నావ్ కదా.. ఏమైంది అని అడుగుతాడు రామరాజు. ‘ ఇది మారకద్రవ్యాల కేసు కాబట్టి.. తానేం చేయలేని అంటున్నారు. ఏదైనా కోర్టులోనే ట్రై చేసుకోమంటున్నారు’ అని అంటాడు చందు. దాంతో రామరాజుకి సేనాపతి అన్న మాటలు గుర్తొచ్చి.. దీనంతటకీ కారణం ఆ సేనాపతి, భద్రావతి అని అనుకుంటాడు. ‘రేయ్ పెద్దోడా అమ్మని జాగ్రత్తగా చూసుకో.. నేను ఇప్పుడే వస్తానంటూ సేనాపతిని వెతుక్కుంటూ వెళ్తాడు. అటు సేనాపతి.. స్నేహితులతో కలిసి ఫుల్ ఖుషీలో ఉంటాడు. ఆ రామరాజు గాడు ఏడుస్తుంటే నాకు కన్నుల పంటగా ఉందిరా. చచ్చావ్ రా.. నిన్ను వదిలిపెట్టను.. ఆ రామరాజు గాడ్ని ఇంకా ఏడిపిస్తా.. వాడు నా కాళ్లు పట్టుకునేట్టు చేస్తా.. అప్పుడు ఓ తన్ను తన్నుతా ఎగిరి అవతల పడతాడు అని హేళనగా నవ్వుతుంటాడు. అప్పుడు నిజంగానే ఎగిరిపడతాడు రామరాజు కాదు.. సేనాపతి. వెనుక నుంచి రామరాజు ఎరిగితన్తాడు. పెద్ద కత్తి తీసుకుని నరసింహుడిలా విజృంభిస్తాడు రామరాజు. సేనాపతికి చావు భయం చూపిస్తాడు. ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తా అంటూ సేనాపతిపై దాడికి ప్రయత్నిస్తాడు రామరాజు. అయితే సేనాపతి కూడా ఎదురుతిరుగుతాడు. కత్తి కింద పడిపోవడంతో.. ఇద్దరూ కలబడతారు. అయితే రామరాజు చితకబాదేయడంతో సేనాపతి బొక్క బోర్లా పడతాడు. సేనాపతికి చావు భయం చూపించిన రామరాజు నా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేయిస్తావ్ రా అంటూ పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తెచ్చి సేనాపతని చంపేయబోతాడు రామరాజు. కరెక్ట్ టైమ్‌కి తిరుపతి వచ్చి.. అడ్డుకుంటాడు. సేనాపతిని అతని స్నేహితులు మెల్లగా అక్కడ నుంచి తప్పిస్తారు. ఏంటి బావా ఇదీ.. నువ్వు కూడా ఆవేశపడితే ఎలా బావా అని అంటాడు తిరుపతి. ‘ఎన్నాళ్లు ఓపిక పట్టాలిరా.. వాళ్లు ఏం చేసినా భరిస్తూ ఉండాలా? రగిలిపోతాడు రామరాజు. కాస్త శాంతించు బావా.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు.. వాళ్ల పాపాన వాళ్లే పోతారు వదిలెయ్ బావా’ అని ప్రాధేయపడతాడు తిరుపతి. దాంతో రామరాజు.. ‘జెర్సీ సినిమాలో నాని మాదిరిగా పెద్దగా అరుస్తూ.. కోపాన్ని అణచి వేసుకుంటాడు. నేను వచ్చేశా అత్తా.. అటు ప్రేమ కఠిన నిర్ణయం తీసుకుంటుంది. అక్కడ ధీరజ్.. ఇక అత్తయ్యా, మామయ్యా నరకం అనుభవించడానికి కారణం నేనే.. ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా అని ఆలోచిస్తుంది. అప్పుడు భద్రావతి అన్న మాట గుర్తు చేసుకుంటుంది. నువ్వు ఈ ఇంటికి వస్తే కేసు వెనక్కి తీసుకుంటానన్న మాటని గుర్తు చేసుకుని.. నా వల్ల నీకు వచ్చిన సమస్యని నేనే పరిష్కరిస్తాను.. దానికి ఏం చేయాలో అదే చేస్తాను. రేపు ఉదయానికల్లా నువ్వు ఈ ఇంట్లో ఉంటావ్. దానికి నేను ఓ నిర్ణయానికి వచ్చాను’ అని అనుకుంటుంది ప్రేమ. ఇక అత్తింటి గుమ్మందాటి.. పుట్టింటికి వెళ్లిపోతుంది ప్రేమ. నేను వచ్చేశా అత్తా అని భద్రావతికి షాకిస్తుంది ప్రేమ. మరి ధీరజ్ని జైలు నుంచి విడుదల అయ్యాడా? ప్రేమ మళ్లీ అత్తింటికి వచ్చిందో లేదో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.