
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Bandi Bhagirath pocso case three days police interrogation custody ends: బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం పొక్సో కేసులో మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టు మూడు రోజుల పాటు పేట్ బషిరాబాద్ పోలీసులకు కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో సిట్ పోలీసులు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు భగీరథ్ ను విచారించారు.
ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అంతే కాకుండా బాలికతో ఏవిధంగా పరిచయం ఏవిధంగా జరిగింది. స్నేహితుల పాత్రపైన ప్రశ్నలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఫోన్ ను పలు మార్లు ఫార్మెట్ చేయడం, మైనర్ బాలిక వీడియోలు బైటకు రావడం, రూ.
50 వేలు ట్రాన్స్ ఫర్ చేయడం మొదలైన వాటిపై సిట్ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అంతే కాకుండా మే 8న మైనర్ బాలిక ఫిర్యాదు చేయడం అదే రోజు సాయంత్రం బండి భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక అసలు కారణం ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఫామ్ హౌస్ కు బాలికను బలవంతంగా తీసుకెళ్లాడా..?.. లేదా ముందే అత్యాచారం ప్లాన్ తో మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసిన బండి భగీరథ్ నుంచి మౌనమే
సమాధానంగా వచ్చినట్లు టాక్ నడుస్తొంది. మొత్తంగా పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీ ముగియడంతో మరల మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టులో బండి భగీరథ్ ను హజరు పర్చారు. కోర్టు ఆదేశాలతో మరల బండి భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.
Read more; Bandi Bhagirath Case: బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం.. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించిన కోర్టు..
ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి ప్రశ్నలు వేశారు..?.. తమ వద్ద ఉన్న సమాచారంలో బండి భగీరథ్ నుంచి ఏదైనవిషయాలు రాబట్టారా అన్నదానిపై సిట్ అధికారులు స్పందిస్తే ఒక క్లారిటీ వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం బండి భగీరథ్ కేసుపై కాంగ్రెస్, బీజేపీల పై తీవ్ర విమర్శలు చేస్తునే ఉంది. మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే కేంద్ర సహయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి