
హైదరాబాద్ మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఆమోదించడం లేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న ఓ నేత మెట్రో విస్తరణను దిల్లీలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కిషన్రెడ్డి
భాజపాలోనే ఉండి.. కేటీఆర్కు సహకరిస్తారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. ప్రజల కోసం పనిచేస్తానని, ఇతర పార్టీలకు కాదని వ్యాఖ్యానించారు. మెట్రోకు ఎందుకు అనుమతులు రావడం లేదో కిషన్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ భగాయత్ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఈమేరకు ప్రసంగించారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్సే: ఆది శ్రీనివాస్