"బ్రదర్ అన్నీ ఇప్పటికిప్పుడు అంటే " అంటాడు కార్తీక్. "ఓకే బ్రదర్. ఈవినింగ్ వరకు టైమ్ ఇస్తాను. ఈలోపు మీకు మీరే కాల్ చేసి నాకు నష్టపరిహారం ఇప్పించండి. ఉంటానండి. థ్యాంక్యూ " అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. "తాత వాడి మాటలు నమ్మకండి తాత.
బావ ఎప్పుడూ బయటవాళ్లకే సపోర్ట్ చేస్తాడు. అది ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ సూరజ్ లాంటి వీధి గుండాలను మనం ఎంకరేజ్ చేస్తే రోజుకు ఒకడు ఇంటికి వచ్చి ఇలాగే గొడవ చేస్తాడు. అసలు వాడోక వెస్ట్ ఫేలో తాత. అసలు వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ తాత" అంటుంది జ్యోత్స్న.
శివనారాయణ మౌనంగా ఉండిపోతాడు. గదిలో జ్యోత్స్నా, పారిజాతం ఇద్దరూ సూరజ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటారు. "నువ్వు అర్జెంటుగా తట్ట బుట్ట సర్దుకొని ఏ ప్రపంచ యాత్రకో పోవే" అంటుంది పారిజాతం. "జరిగినదాంట్లో నా తప్పేమి లేదు గ్రానీ " అంటుంది జ్యోత్స్న ధీమాగా.
"ఆ.. నీదే తప్పు లేకపోతే వాడు ఇల్లు వెతుక్కుంటూ ఎలా వస్తాడు " అంటుంది పారిజాతం. "వాడోక వేస్ట్ ఫెలో " అంటుంది జ్యోత్స్న. "ఈ మాట వాడికంటే బాగా నీకే సూటయ్యేలా ఉంది. అరవకు. మండుతుంది ఇక్కడ. దారినపోయే దరిద్రాలన్నీ ఇంటి మీదకు తీసుకువస్తున్నందుకు.
వాడు ఎవడైనా కానీ. నువ్వు గొడవ పడడం అవసరమా. ఎప్పుడు ఏదోక పెంట. అయితే దీపతో, కార్తీక్ గాడితో లేదంటే ఆ వైరా గాడితో.. ఇప్పుడు వాడు కూడా లేడు కాబట్టి గొడవలు పెట్టుకోవడానికి వేరోకడు " అంటుంది పారిజాతం. "నాకు గొడవలు పెట్టుకోవడం తప్ప వేరోక పని లేదనుకుంటున్నావా" అంటుంది జ్యోత్స్న.
"చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. సైకోలా తయారయ్యావు
. నేనొక దాన్ని మిగిలిపోయినట్లు ఉన్నాను. నాతో కూడా గొడవ పెట్టుకో రా " అంటూ అరుస్తుంది పారిజాతం. "అర్రే మతిలేనిదానిలా మాట్లాడకు గ్రానీ. ఆ సూరజ్ గాడు పెద్ద ఇగోఇస్ట్. వాడిది ఫ్లాట్ ఫామ్ బతుకే అయినా మాటలు మాత్రం మిర్జాపూర్ జమీందార్ లా ఉంటాయి. అలాంటి నేల టికెట్టు గాడికి మనలాంటి డబ్బుకన్న వాళ్లంటే ఈర్ష్య. మనం ఖరీదైన జీవితాన్ని బతుకుతా ఉంటే చూసి ఓర్వలేడు. కడుపు మండుతుంది. ఆ కడుపుమంటతోనే నాతో గొడవ పెట్టుకున్నాడు " అంటుంది జ్యోత్స్న. "మనం గాజులాంటి వాళ్లాం. ఎవరు రాయి విసిరినా పగిలేది మన అద్దమే " అంటుంది పారిజాతం. "ఈసారి పగిలేది వాడి అద్దమే " అంటుంది జ్యోత్స్న.
"మీ తాత పిలుస్తున్నాడు. ఆ సూరజ్ గాడి గురించే అయ్యుంటుంది. నా మాట విని సారీ చెప్పవే" అంటూ జ్యోత్స్నను బతిమాలుతుంది పారిజాతం. "ఆ పని నేను చచ్చినా చేయ్యను " అని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్నా. వెనకే కంగారుగా పారిజాతం పరుగెడుతుంది. హాల్లో శివనారాయణ, దశరథ అందరూ కూర్చుంటారు. "ఏంటీ తాత పిలిచావు " అంటుంది జ్యోత్స్న. "ఏం జరిగిందో మాకు అర్థమైంది. అసలేందుకు జరిగిందో మాకు అర్థం కాలేదు" అంటాడు శివనారాయణ. "నీకు ఆ ఫుట్ పాత్ వెండర్ కు గొడవ ఏంటీ.. అతడి స్టాల్ నువ్వు ఖాలీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది " అని అడుగుతాడు దశరథ.
"అసలు వాడోక వేస్ట్ ఫేలో డాడీ. వాడి మాటలు సీరియస్ గా తీసుకుంటారేంటీ" అంటుంది జ్యోత్స్న. "వీడియోతో సహా అంతా క్లారిటీ చూపిస్తుంటే సీరియస్ గా తీసుకోవద్దు అంటావేంటీ " అంటుంది కాంచన. "మనం ఉన్నది ఏఐ టెక్నాలజీలో అలాంటివి నాకు ఫేవర్ గా వంద చూపిస్తాను. నువ్వు నమ్ముతావా " అంటుంది జ్యోత్స్న. "ఏంటీ వంద చూపించేది. తప్పు నీదే అని మీ బావే సాక్ష్యం చెప్పాడు కదా" అంటుంది సుమిత్ర. "పిల్లికి ఎలుక సాక్ష్య్ం అన్నట్లుగా ఉంది మమ్మీ" అంటుంది జ్యోత్స్న. "పిల్లి కల్లు మూసుకొని పాలు తాగుతుంటే లోకం చూడలేదు అన్నట్లే ఉంది పెద్ద మేడమ్ గారు. నువ్వు చేసిన పని వీడియోతో సహా బయటపడిన తర్వాత ఇంకా ఎందుకు నిజం ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తావు" అంటాడు కార్తీక్. "వాడొచ్చింది. నష్ట పరిహారం కోసం" అంటుంది జ్యోత్స్న.
"నష్టం చేశావు కాబట్టే నష్ట పరిహారం కోసం వచ్చాడు" అంటాడు కార్తీక్. "మీ ఆవిడను సీఈఓను చేయడానికి నా మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు బావ" అంటుంది జ్యోత్స్న. "గెలవడానికి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మాకు లేదు " అంటుంది దీప. "అది కాదు దీప. ఏదైనా చిన్న తప్పు జరిగింది అనుకో.. బయటవాళ్ల ముందు మన వాళ్లను తక్కువ చేయకూడదు కదా " అంటుంది పారిజాతం. "అసలు ఏం జరిగిందో తెలిస్తే కదా. తప్పు ఎవరిదో అనడానికి. అసలు ఆ అబ్బాయి జ్యోత్స్నకు ఎలా తెలుసు. ఎందుకు తన ఫుడ్ స్టాల్ ను పాడు చేయాలనుకుంది" అంటాడు శివనారాయణ.
"ఈగో సార్. ఈగో క్లాష్. అవును సర్" అంటాడు కార్తీక్. "అంటే ఇద్దరి మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా " అంటాడు శివనారాయణ. "వాడికి తెలియని కథలు ఏముంటాయి చెప్పండి. ప్రతి ఒక్కరి కథలో వీడు ఉంటాడు " అంటుంది పారిజాతం. "నీ జేబులో ఉన్న పెన్ను ఇటు ఇవ్వు తాత. కాసేపు నన్ను బయటి వ్యక్తిని అనుకో. ఈ పెన్ను నాకు కావాలి ఎంతకు ఇస్తావు" అంటాడు కార్తీక్. "నేనెందుకు ఇస్తాను. అది నా పెన్ను. నీకు నచ్చితే అయితే వేరేది కొనుక్కో" అంటాడు శివనారాయణ. "నాకు నచ్చింది. 10000 ఇస్తాను అంటూ ఇదే తాత సూరజ్ కు జ్యోత్స్నకు మధ్య గొడవ. నేను సూరజ్. నువ్వు జ్యోత్స్న. షాపులో సూరజ్ కొనుక్కున్న బొమ్మ కావాలని పట్టుబట్టింది. నీకేందుకు మేడమ్ పక్కొళ్ల వస్తువుల మీద అంత మోజు. ఆరోజు అలా మొదలైన గొడవ పెద్ద మేడమ్ గారు మర్చిపోలేదు. అతను మీద అవకాశం దొరికినప్పుడు పగ తీర్చుకోవాలనుకుంది. కారులో ఎక్కించుకుని రాంగ్ ప్లేస్ లో వదిలిపెట్టింది. మీరు పగ తీర్చుకోవాలనుకుంటే అతను బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ వాళ్లకు కాల్ చేసి స్టాల్ తీయించింది. టాయ్ షాపులో బొమ్మతో మొదలైన గొడవ ఇంట్లో పంచాయితీ వరకు వచ్చింది" అంటాడు కార్తీక్.
"వచ్చింది కాదు. తెచ్చాడు. దీనికి నా తప్పేమీ లేదు " అంటుంది జ్యోత్స్న పొగరుగా. " ఆపవే. నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగొద్దు. తప్పు నీదే అని స్పష్టంగా అర్థమవుతుంది. నీకెందుకే అంత ఈగో. నువ్వు అడిగింది.అందరూ ఇచ్చేయాలా. ఇవ్వకపోతే పగ సాధిస్తావా. మామయ్యగారు తప్పు దీనిదే అని అర్థమైంది కదా. ఇంకా మీరే సరి చేయండి " అంటుంది సుమిత్ర. " కార్తీక్ సూరజ్ ను రమ్మను. జ్యోత్స్న నువ్వు పైకి వెళ్లు. మన పరువు బయటివాళ్లు తీయడం లేదు. ఇంట్లో వాళ్లే తీస్తున్నారు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచకపోవడం కూడా నేరమే అని ఇప్పుడు అర్థమవుతుంది" అంటాడు శివనారాయణ. "ఈ దరిద్రపు దీప ఎప్పుడూ ఏదోక పెంట తీసుకొచ్చి మా నెత్తిన వేస్తుంది " అంటూ కోపంతో రగిలిపోతుంది పారిజాతం.
గదిలో కోపంతో రగిలిపోతున్న జ్యోత్స్న దగ్గరకు వస్తుంది దీప. "ఎందుకోచ్చావు. నా మీద తల ఎగేరేసుకుని తిరుగుతున్నావు కదా. నీకు తగిన శాస్త్రి జరిగిందని చెప్పడానికి వచ్చావా.. లేదా నా పతనం మొదలైందని చెప్పడానికి వచ్చావా " అంటుంది జ్యో్త్స్న. "నువ్వు చేసే పనులకు నేను బాధపడుతున్నాను. పర్వాలేదు.నువ్వు చేసే పనులకు మా బావ బాధపడుతున్నాడు. అది కూడా కొంచెం తట్టుకోలేని విషయమే అయినా పర్లేదు. కానీ ఇప్పుడు నువ్వు చేసే పనులకు నా కుటుంబం బాధపడుతుంది. ఇది సరేలే సరిపెట్టుకునే విషయం కాదు జ్యోత్స్నా. కాళ్లు పట్టుకో.. నీ విషయంలో నేను చేసింది తప్పు అని ఆ సూరజ్ కాళ్లు పట్టుకో" అంటుంది జ్యోత్స్న.
"నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా " అంటుంది జ్యోత్స్న. "ఒక పొగరుబోతుతో మాట్లాడుతున్నాను. ఒక అహంకారితో మాట్లాడుతున్నాను " అంటుంది దీప. "అలాగే నీకంటే గొప్పదానితో మాట్లాడుతున్నావు " అంటుంది జ్యోత్స్న పొగరుగా. "నువ్వు ఎందులో గొప్పే. చెప్పు. జనాలను ఏడిపించడంలోనా. పెంచిన కుటుంబాన్ని బాధపెట్టడంలోనా.. చెప్పే నువ్వు ఎందులో గొప్ప" అంటుంది దీప. "అసలు నీకు ఎందుకు నచ్చట్లేదో చెప్పు" అని అడుగుతుంది జ్యోత్స్న. "నువ్వోక పద్దతి తెలియని మనిషివి "అంటుంది దీప. "ఆ సూరజ్ గాడు నాకు అందుకే నచ్చట్లేదు. వాడికి బాగా పొగరు. ఆ పొగరు నా మీద చూపిస్తున్నాడు" అంటుంది జ్యోత్స్న. " జరిగింది విన్నాక మీ ఇద్దరిలో ఎవరికి పొగరో అర్థమవుతుంది " అంటుంది దీప.
"వాడు పద్దతిగా మాట్లాడితే వాడేదో ఉత్తముడు అనుకుంటున్నావేమో. అంతలేదమ్మా. వాడోక శాడిస్ట్. నన్ను అర్థరాత్రి రోడ్డు మీద నడిపించాడు. నాకేదైనా అయ్యుంటే ఇవేమీ కనిపించవు మీకు" అంటుంది జ్యోత్స్స. "నువ్వే వెళ్లి అనవసరంగా సూరజ్ తో గొడవ పెట్టుకున్నావు" అంటుంది దీప. " నా ఇష్టం. అడగడానికి నువ్వేవరు" అంటుంది జ్యోత్స్న. "నా భర్త మంచివాడు కాబట్టి నువ్వేన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాడు. నిన్ను మారమని మందలించాడు. కానీ సూరజ్ మా బావలాగా అంత ఓర్పు సహనం ఉన్న మనిషి కాదు. నువ్వు వీలైనంత త్వరగా వెళ్లి సూరజ్ కు సారీ చెప్పకపోతే వాడు నీ జుట్టు పట్టుకుని నిలబడి కాళ్ల మీద పడేలా చేసుకుంటాడు" అంటూ కౌంటరిస్తుంది దీప. "నిలబడి కలలు కనకు దీప. నా జుట్టు పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు. రానీ వాడితోనే తేల్చుకుంటాను. నాకు తగ్గాల్సిన అవసరమేంటీ. ఏం జరిగినా ఫేస్ చేయడానికి రెడీ. ఏం చేసుకుంటారో చేసుకోండి " అని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
సీన్ కట్ చేస్తే సూరజ్‌ని పిలిపిస్తాడు శివనారాయణ. పంచాయితీలో అంతా ఉంటారు. వినయంగా సూరజ్‌తో తాత.. "నా మనవరాలికి నీకు మధ్య జరిగిన గొడవేంటో నా మనవడు మొత్తం చెప్పాడు. జరిగినదానికి నువ్వు నష్ట పరిహారం అడగడంలో తప్పేమీ లేదు. ఎంత కావాలని అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. వచ్చి మర్యాదగా అడిగావు. కాబట్టి నష్ట పరిహారం కింద ఈ ఐదు లక్షలు తీసుకో. ఆ డబ్బులు తీసుకుని నువ్వు బయలుదేరొచ్చు. మరోసారి నా మనవరాలు నీ జోలికి రాకుండా నేను చూస్తాను. నీకు జరిగిన నష్టం కంటే నేను ఇచ్చే పరిహారం ఎక్కువ అనా. పర్లేదు తీసుకో" అంటాడు శివనారాయణ.
"ఇది సరిపోదు సర్" అని సూరజ్ అనడంతో అందరూ షాకవుతారు. "చెప్పాను కదా. ఇతను డబ్బు మనిషి అని. ఇలాంటి వాళ్లు అవకాశం దొరికినప్పుడల్లా దొరికినంతా దండుకోవాలి అనుకుంటారు " అంటుంది జ్యోత్స్న. "మేడమ్ గారు. అన్నీ కేసులు మనమే వాదిస్తే ఎలా . పాపం ఆయనను కూడా మాట్లాడనివ్వండి. ఇచ్చింది సరిపోదు అంటున్నాడు కదా " అంటాడు కార్తీక్. "నాకు జరిగిన నష్టానికి పరిహారం కావాలి. నాకు డబ్బులు అవసరం లేదు సర్. మీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు. నేను నష్టపోయిన డబ్బు కంటే నేను నష్టపోయిన మర్యాదే ఎక్కువ. నేను నష్టపోయిన మర్యాదను నాకు ఇప్పించండి" అంటాడు సూరజ్.
"డబ్బులు అయితే ఇవ్వొ్చ్చు. మర్యాదను ఎలా ఇస్తారయ్యా " అంటుంది పారిజాతం. "ఎలా అయితే పోగొట్టారో అలాగే ఇవ్వండి" అంటాడు సూరజ్. "నువ్వు భలే ఉన్నావు బ్రదర్. మర్యాద ఎలా తిరిగి ఇస్తారు. అదేదో కాస్త వివరంగా అడుగు " అంటాడు కార్తీక్. "నేను గౌరవం సంపాదించుకున్న చోట గౌరవాన్ని కోల్పోయాను. నమ్మకాన్ని సంపాదించుకున్న చోట నమ్మకాన్ని కోల్పోయాను. నాకు గౌరవాన్ని, నమ్మకాన్ని, నా మర్యాదను తిరిగి ఇస్తే చాలు. నాకు మీ నుంచి ఒక్క రూపాయి కూడా వద్దు " అంటాడు సూరజ్. "అతను ఏం అడగాలి అనుకుంటున్నాడో నాకు అర్థమైందీ గ్రానీ. నాచేత సారీ చెప్పించుకోవాలి అనుకుంటున్నాడు. ఇంకా ఏంటీ ఆలోచిస్తావు. సారీ కదా నీకు కావాల్సింది" అంటుంది జ్యోత్స్న.
"సారీ సరిపోదు మేడమ్. నాకు న్యాయం చేయండి " అంటాడు సూరజ్. అప్పుడు కార్తీక్.. కావాలనే జ్యోని ఇరికించడానికి.. "డబ్బులు వద్దంటావు. సారీ సరిపోదంటావు. ఇంకేం కావాలి బ్రదర్. నీకు న్యాయం ఎలా చేయమంటావ్ చెప్పు. నువ్వు అడిగేది చూస్తుంటే ఎలా ఉందో తెలుసా.. సూరజ్ విషయంలో నేను తప్పు చేశాను అని మా జ్యోత్స్న ఫ్లేక్సీ వేసి నీ షాపు ముందు పెట్టమనేలా ఉన్నావే " అంటాడు కార్తీక్. " కార్తీక్ గారు చెప్పింది న్యాయంగానే ఉంది. అదే చేయించండి" అంటాడు సూరజ్. "బోడి జ్యూస్ షాపు ముందు మన పిల్లది ఫ్లెక్సీ పెట్టడమేంటీ. ఇంకా నయం నష్ట పరిహారంగా జ్యోత్స్నను జ్యూసులు సర్వ్ చేయమనలేదు" అంటుంది పారిజాతం.
" "మీరు చెప్పింది న్యాయంగానే ఉంది. ఏ షాపు దగ్గర నా మర్యాద పోయిందో అక్కడే మేడమ్ గారు ఫ్లెక్సీ పెట్టాలి. మేడమ్ గారే ఒక గంట నా షాపు దగ్గర నిలబడి సర్వ్ చేయాలి. నేను కోరుకుంటున్న నష్ట పరిహారం ఇదే " అంటాడు సూరజ్. దీంతో అందరూ షాకవుతారు.. "దీనికి నేను ఒప్పుకోను"అని అరుస్తుంది జ్యోత్స. ఇక కార్తీక్, దీపలు నవ్వకుంటారు. శివనారయాణ మాత్రం సూరజ్ తరపునే న్యాయం చెప్పేలా ఉండటంతో జ్యో రగిలిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. అయితే కమింగ్ అప్‌లో అసలు ట్విస్ట్ ఉంది.
జ్యో.. ఒప్పుకోను అంటున్నా.. తాత తీర్పు ఇస్తాడు. ‘మీరు కోరినట్లే జరుగుతుంది బాబు’ అని సూరజ్‌కి జ్యో ముందే చెబుతాడు. దాంతో కార్తీక్.. "దీంట్లో ఒప్పుకోకపోవడానికి ఏముంది పెద్ద మేడమ్ గారు. నీ ఫ్లె్క్సీలు పెట్టావనుకో.. సమాజసేవ కోసం మాజీ మేడమ్ గారు అంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది " అంటాడు. ఇక ఫైనల్‌గా తాత.. " సూరజ్ చెప్పినట్లు చేయండి" అంటాడు. సీన్ కట్ చేస్తే.. జ్యోని నిలబెట్టి.. రకరకాల పోజులు చెబుతూ.. బలవంతంగానే ఫ్లెక్సీల కోసం ఫోటోస్ తీస్తాడు కార్తీక్.పారు కూడా పక్కనే ఉంటుంది. జ్యో, పారులు ఆ పరిస్థితికి రగిలిపోతూ ఉంటారు. కానీ తప్పని స్థితిలో జ్యో.. తాత ఆర్డర్ ప్రకారం ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంది. ఇక సూరజ్.. అప్పుడే కార్తీక్ దగ్గరకు వచ్చి.. జ్యోని చూసి నవ్వుతూ.. " మార్నింగ్ స్టాల్ దగ్గరకు మేడమ్ గారెని తీసుకుని వచ్చేయండి" అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. మొత్తానికీ జ్యోకి మామూలు దెబ్బ తగల్లేదుగా. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.