
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Sarojini Damodaran Foundation Vidyadhan Scholarships 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్. సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ప్రతిభ గల పేద విద్యార్థులను ఆదుకోవడం కోసం ‘విద్యాదాన్’ ఉపకార వేతనాల పేరిట.. ప్రతి సంవత్సరం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు రూ. 10 వేల నుంచి రూ. 75 వేల వరకు స్కాలర్షిప్ను ఇస్తారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా విద్యాదాన్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పది, ఇంటర్ ఫలితాల్లో పాస్ అయిన విద్యార్థులు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి జూన్ 20 చివరి గడువుగా ప్రకటించింది. దీనికి దరఖాస్తు చేస్తున్న విద్యార్థులకు.. జూలై 5న ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు టెన్త్, ఇంటర్లో చూపిన ప్రతిభ, దరఖాస్తులో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి.. వారికి ఆన్లైన్ పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పరీక్ష వివరాలను ఈ-మెయిల్ ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకొనే విద్యార్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2 లక్షల లోపు ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదో తరగతిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్, డిప్లొమా చదువుతున్న వారు కూడా ఈ స్కాలర్షిప్కు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు రెండేళ్ల పాటు ఉపకార వేతనాలు అందిస్తారు. కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఏడాదికి రూ. 10 వేల నుంచి రూ. 75 వేల వరకు ఉపకార వేతనాలు ఇస్తారు.
విద్యార్థులు మరిన్ని వివరాల కోసం vidyadhan.andhra@sdfoundationindia.com అనే సైట్లో లేదా 96635 17131 నంబరుకి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు కాల్ చేసి అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఫౌండేషన్ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.