
ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది? (ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?) 90స్లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది. లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా
May 29 2026 9:27 AM | Updated on May 29 2026 10:03 AM
ప్రతి వీకెండ్ రాగానే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని సినీ ప్రేమికులు చూస్తూ ఉంటారు. వాళ్ల కోసమా అన్నట్లు ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్ తదితర చిత్రాలు వచ్చేశాయి. ఇప్పుడ వీటికో తోడుగా ఓ హారర్ మూవీ కూడా తెలుగులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?
(ఇదీ చదవండి: 'పెద్ది' టికెట్ ధరలు ఎంతెంత పెంచారంటే?)
90స్లో పుట్టి పెరిగిన వాళ్లలో చాలామంది హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే 'మమ్మీ' ఫ్రాంచైజీ చిత్రాలు వీళ్లకు అలరించిన వాటిలో కచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు పలు భాగాలుగా రిలీజయ్యాయి కానీ అవన్నీ అడ్వెంచర్ కామెడీ తరహాలో ఉండేవి. ఈ ఏడాది మాత్రం ఇదే ఫ్రాంచైజీ నుంచి హారర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో మూవీ వచ్చింది.
లీ క్రోనిన్ దర్శకత్వం వహించిన 'ద మమ్మీ' సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని ఆకట్టుకుని పర్లేదనిపించింది. రెండు వారాల క్రితం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి రాగా ఇప్పుడు ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీ, తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
'ద మమ్మీ 2026' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడతాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెట్టేలా ఉన్నాయని చూసినవాళ్లు చెప్పారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)
సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు)
అధికారంతో రెచ్చిపోతున్న ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు
జూమ్ లోకి కొడాలి నాని, వంశీ వస్తే ప్యాంటు తడుపుకున్నావ్.. లోకేష్ వ్యాఖ్యలపై రోజా రెటైర్లు
తమ్ముడికి వెన్నుపోటు పొడిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు సిద్ధరామయ్య పాత్ర ఏంటి..?