
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Bigg Boss 10 Telugu Promo: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన 10వ సీజన్లోకి అడుగుపెడుతోంది. ఇటీవల ముగిసిన 9వ సీజన్లో కామన్ మెన్ కేటగిరీ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
హోస్ట్ ఎవరంటే..! ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ.. కింగ్ నాగార్జున తనదైన స్టైలిష్ లుక్, పవర్ఫుల్ ఎనర్జీతో ప్రోమోలో ప్రత్యక్షమయ్యారు. 'నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్' అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో సాగిన ఈ ప్రోమోలో నాగార్జున హోస్టింగ్ హైలైట్‌గా నిలిచింది.
"బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం" అంటూ నాగ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపాయి. అయితే ఈ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది తాను కాదని, బిగ్ బాస్‌ను అమితంగా ప్రేమించే అభిమానులేనని ఆయన స్పష్టం చేశారు.
ఈసారి ప్రోమోను కాస్త విభిన్నంగా, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. సాధారణ సెలూన్ షాపుల నుండి హైటెక్ ఐటీ ఆఫీసుల వరకు.. ఇళ్లలోని కుటుంబ సభ్యులందరూ బిగ్ బాస్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో ఇందులో చూపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక డైలీ డోస్ ఎంటర్టైన్మెంట్గా మారిందని.. సరికొత్త ఎమోషన్స్, గొడవలు, నవ్వులతో ఈ షో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందని హింట్ ఇచ్చారు.
ప్రోమో చివర్లో నాగార్జున చెప్తూ.. "ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ 'దశావతారం'. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!" అంటూ షోపై అంచనాలను భారీగా పెంచేశారు. కింగ్ నాగ్ మార్క్ ఎనర్జీతో ఉన్న ఈ 'కమింగ్ సూన్' ప్రోమో చూస్తుంటే, ఈ సారి కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పదో సీజన్ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.