
‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’.
May 29 2026 5:56 AM | Updated on May 29 2026 5:56 AM
‘పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’. ఈ చిత్రం ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీ సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవీ ప్రసాద్, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి ముఖ్య పాత్రలు పోషించారు.
వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవీన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 19న విడుదల కానుంది. కల్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘టా టా...’ అనే తొలి సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు. విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘ఓ సాధారణ కానిస్టేబుల్ నిజాయతీగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తూనే మొండివాడుగా ఉంటుంటాడనే విషయాలను ఆవిష్కరించేలా ఈ పాట ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది.
సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు)
తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు (ఫోటోలు)
ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు
నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
రిలేషన్ లో ఉంటే గీ పనులు అసలు చేయకుండ్రి..!