
థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన 'భూత్ బంగ్లా' ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఈ అక్షయ్ కుమార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. జూన్ 12న ఈ హారర్-కామెడీ సినిమా ప్రీమియర్ కావొచ్చని అంచనా. అయితే, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ మళ్లీ కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై రిలీజ్కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన కల్ట్ కామెడీ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి
.