
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘త్రికాల’. మైథాలిజిలక్ ఫిక్షనల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. శ్రద్ధాదాస్ లీడ్ రోల్లో యాక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే.. కొన్ని శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో నేపథ్యంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడున్న మునులు, ఋషులు అందరు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు రాక్షసుల చేతికి చిక్కకుండా కాకుండా ఓ రహస్య ప్రాంతంలో దాచిపెడతారు. అంతేకాదు దాన్ని కాపాడానికి ‘శక్తి ఏథా’ అనే ఓ దైవిక పరమైన ఆయుధాన్ని సృష్టిస్తారు. దాన్ని ఆ ప్రాంతాన్ని పాలించే త్రికాల వర్మ అనే రాజుకు అప్పగిస్తారు. అయితే ఆ తాంత్రిక శక్తుల కోసం అసురులు వచ్చినపుడు రాజు వారిపై పోరాడుతూ కన్నుమూస్తాడు. అయితే మునులు మాత్రం రాజు ఆత్మను ఓ అండంలో భద్రపరుస్తారు. కలియుగంలో ప్రపంచానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నపుడు ఆ ఆత్మ మేల్కొని దుష్ట శక్తులను అంతం చేస్తుందని చెబుతారు.
ఆ తర్వాత కట్ చేస్తే ప్రస్తుత కాలంలో శివ (మాస్టర్ మహేంద్రన్) అనే యువకుడు కనిపంచకుండా పోయిన నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్లో ఓ దుష్టశక్తి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో అతనికి వైతరణ్ (వైతరణ్) అనే వ్యక్తి గురించి తెలుసుకుంటాడు. అతనికి సూర్మరశ్మిని తట్టుకునే శక్తి ఉండదు. అతను పూర్వజన్మలో త్రికాల వర్మ. అతను ఓ చిత్రమైన మానిసిక వ్యథతో తన కుటుంబ సభ్యులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుంటాడు. అతని ఆత్మ ఓ బంగ్లాలో తిరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఆ ఇంట్లోకి వెళ్లి మాయ అనే సైక్రియాటిస్ట్ (శ్రద్దా దాస్) చిక్కుకుపోతుంది. అదే సమయంలో అసురుల రాజు భూమిపై తన ఆధిపత్యం కోసం మేల్కొంటాడు. ఈ క్రమంలో అండంలో దాగున్న త్రికాల వర్మను కొంత మంది తాంత్రికులు మేల్కొపుతారు. చివరకు అసుర శక్తులపై దైవ శక్తి విజయం సాధించిందా.. ? ఈ క్రమంలో కనిపించుకుండా పోయిన శివ ప్రియురాలు అతనికి దొరికిందా.. ? అసలు శివకు ఈ కథతో ఉన్న లింకేమిటి.. ? అతని ప్రియురాలు అదృశ్యం వెనక ఉన్న శక్తులెవరో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ముఖ్యంగా మన సనాతన ధర్మంలో మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌ను దర్శకుడు ఎత్తుకోవడం మంచి విషయం అని చెప్పాలి. ముఖ్యంగా మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతాయనే విషయాన్ని ఈ సినిమాల చూపెట్టాడు దర్శకుడు. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రల మానసిక స్థితి, వారి గతం, పునర్జన్మల ద్వారా చూపించిన తీరు బాగుంది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ధర్మసంస్థాపన కోసం ఎన్నో అవతారాలు ఎత్తారు. అంతేకాదు మహా భారతంలోని భగవద్గీతలో కూడా పుట్టినవాడికి మరణం తప్పదు.. మరణించిన వాడికి జన్మించక తప్పదు.. అనివార్యమైన ఈ విషయం గురించి దు:ఖపడాల్సిన పనిలేదనే మన సనాతన కర్మ సిద్ధాంతాన్ని ఇందులో చూపించే ప్రయత్నం మెచ్చుకోవాలి. మన సనాతన పౌరణిక అంశాలను ఆధునిక ప్రపంచంతో మిళితం చేయడం సినిమాకు ప్రధాన బలం. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు టెక్నికల్ ఫిల్మ్ మేకర్‌గా మణి తెల్లగూటికి ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయి. ఆయన దర్శకత్వ ప్రతిభ .. పురాణాలతో పాటు మన సనాతన ధర్మంపై పట్టు ఇవన్ని అతని టాలెంట్ ను చూపెట్టాయి. సాధారణ దర్శకులు షూటింగ్ తర్వాత VFX గురించి ఆలోచిస్తే, మణి మాత్రం రాజమౌళి తరహాలో కథ రాసే దశ నుంచే ప్రతి ఫ్రేమ్‌ను విజువల్‌గా ఎలా ఉండాలనే దాన్ని ఊహించుకోని ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. విజువల్స్ పరంగా బాగుంది. ఎడిటర్ ఫస్టాహాఫ్ను కాస్త ట్రిమ్ చేయవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది.
‘త్రికాల’లో ప్రతి షాట్‌కు ఒక ప్రత్యేకమైన “డార్క్ విజువల్ పరంగా బాగుంది. మైథాలజీ, తాంత్రిక శక్తులు, సైకాలజికల్ హారర్ అంశాలను ఒకే ప్రపంచంగా చూపించేందుకు ఆయన ఎంచుకున్న ఫ్రేమింగ్ స్టైల్ బాగుంది.
హీరో మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకత్వం, ప్రేమ, భయం, భావోద్వేగం.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఇక అజయ్ చేసిన వైతరణ్ పాత్ర సినిమాకుమ మెయిన్ పిల్లర్‌లా నిలిచింది. సూర్యకాంతిని తట్టుకోలేని ఒక మనిషి, మానసిక ఒత్తిడి, దుష్టశక్తి మధ్య నలిగిన వ్యక్తి పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. శ్రద్ధా దాస్ ఈ సినిమాకు మరో హైలైట్. తన పాత్రలో గ్లామర్ కంటే మిస్టరీ ఎక్కువగా కనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో మంచి నటన కనబరించింది. ముఖ్యంగా హారర్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె యాక్టింగ్ ఆకట్టుకుంటుంది.సీనియర్ నటి ఆమని పాత్ర కూడా సినిమాకు కీలకంగా నిలిచింది. తల్లితనంతో పాటు భయం, బాధ, అనుమానం వంటి భావోద్వేగాలను ఆమె నటనలో కనిపించాయి. సహజంగా చూపించింది.
పంచ్ లైన్.. త్రికాల.. మెప్పించే సైకాలాజికల్ హార్రర్ థ్రిల్లర్..
Also Read: Jr NTR Top Movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ చిత్రాలు ఇవే..
Also Read:Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్టర్ చిత్రాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.