
ఒకప్పుడు టాలీవుడ్లో లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వడ్డే నవీన్ (Vadde Naveen). 'పెళ్ళి', 'చాలా బాగుంది' వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, గత
కొన్నేళ్లుగా వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే, చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ హీరోగా గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' (Transfer Trimurthulu). ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించగా, వడ్డే నవీన్ స్వయంగా 'వడ్డే క్రియేషన్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19, 2026న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రముఖ యాంకర్ సుమ (Anchor Suma) వడ్డే నవీన్ ఇంటికి వెళ్లి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో వడ్డే నవీన్‌తో పాటు ఆయన భార్య మీనా, కొడుకు జిష్ణు కూడా పాల్గొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో డేట్‌కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..
వడ్డే నవీన్ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో ఆయన భార్య, కొడుకు ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. మొదటిసారి వీరిద్దరూ సుమ ఇంటర్వ్యూలో కనిపించడంతో, ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 'వడ్డే నవీన్ భార్య, కొడుకుని చూశారా?' అంటూ అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. వడ్డే నవీన్ తనయుడు జిష్ణు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే జిష్ణు సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ , 'టా టా త్రిమూర్తులు' అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..
ఒక సాధారణ, నిజాయతీ గల పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరిగే యాక్షన్, కామెడీ, సస్పెన్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో వడ్డే నవీన్ సరసన రాశి సింగ్ (Rashi Singh) హీరోయిన్గా నటిస్తోంది. గత పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా, తనను ఇంకా గుర్తుపెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వడ్డే నవీన్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో వడ్డే నవీన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..
[caption id="attachment_1835973" align="alignnone" width="1280"] Vadde Naveen Family[/caption]
ఎక్కువ మంది చదివినవి : Peddi Movie : ఏం తీశాడు భయ్యా.. చరణ్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్.. ఆ ఒక్క సీన్ గూస్ బంప్స్..