
భాష్యం విద్యాసంస్థల అధినేత, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాష్యం రామకృష్ణను ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. శాసనసభలో కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. గుంటూరులో
ప్రైవేటు విద్యాసంస్థలో మాస్టారుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన ట్యూషన్ నడుపుతూ వందలాది మంది విద్యార్థులకు గణితం బోధించారు. గుంటూరులో భాష్యం విద్యాసంస్థలు ప్రారంభించి మూడు రాష్ట్రాలకు విస్తరించి లక్షలాది మంది విద్యార్థులకు బోధన అందింస్తున్నారు. పాఠశాల విద్యలో ప్రత్యేకమైన ముద్ర వేశారు. పెద్దల సభకు లెక్కల మాస్టారు |