
వనభోజనాలకు వెళ్లి చెట్ల కింద ప్రశాంతంగా భోజనాలు చేస్తున్నారు అనుకుంటున్నారా! కానే కాదు. రేషన్ బియ్యం కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిశిఖర గ్రామస్థుల అవస్థలివి. వీళ్లంతా గుణదతీలేసు పంచాయతీ
పరిధి గ్రామాల ప్రజలు. రేషన్ సరకులు తీసుకెళ్లేందుకు గుణద గ్రామంలోని డిపోనకు శనివారం ఉదయం వచ్చారు. అక్కడ వేలిముద్రలు వేసి బియ్యం తీసుకుందామంటే తరచూ విద్యుత్తు అంతరాయాలు, సిగ్నల్ లేకపోవడంతో ఎంతకూ సైట్ కలవడం లేదు. విధిలేక డిపో పక్కనే చెట్ల కింద వేచి చూస్తూ.. 10 నిమిషాలకోసారి డిపోనకు వెళ్లడం, కరెంటు, సిగ్నల్ వచ్చిందా అని కనుక్కోవడం.. పనిగా పెట్టుకున్నారు. మధ్యాహ్నం అక్కడే వంట కూడా చేసుకొని భోజనాలు చేశారు. మొత్తానికి శనివారం 23 మంది వస్తే 8 మంది మాత్రమే సరకులు తీసుకెళ్లారు. మిగతా వారంతా ఖాళీ సంచులతో వెనుదిరిగారు. నెలలో రెండు, మూడు రోజులు ఇలా తిరగాల్సి వస్తోందని రేషన్ కార్డుదారులు ఆవేదన చెందారు.
సరకుల కోసం వేలిముద్ర వేస్తున్న లబ్ధిదారులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.