
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Hyderabad police arrested a person who made death threatening comments on cm revanth reddy: ఇటీవల కొంత మంది యువత సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలు పీక్స్ కు చేరాయి. అధికారంలో ఉన్న వారి గురించి ఇష్టమున్నట్లు పోస్ట్ లు పెడుతున్నారు. నోటికొచ్చినట్లు బూతులతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం తో పాటు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నత హోదాలో ఉన్నవారిపై కూడా నీచంగా మాట్లాడుతున్నారు. వాక్ స్వాతంత్య్రం రాజ్యాంగం ఇచ్చింది కదా.. అతిగా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో సభ ఏర్పాటుకు ప్రయత్నించారు.
కానీ అనూహ్యంగా తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టులో పిటిషన్ వేసిన అక్కడ కూడా చుక్కెదురైంది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో దీనిపై పెద్ద రచ్చ నడింది. భారీగా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నివాసంకు చేరుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ క్రమంలో కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తి నిరసనలో భాగంగా రోడ్డు మీద వెళ్తు ఓరెయ్ రేవంత్ రెడ్డి.. నిన్ను బలిస్తాం.. జనసేనతో పెట్టుకున్నావ్ అంటూ అత్యంత అనుచిత వ్యాఖ్యలుచేశారు. కనీసం ఒక రాష్ట్రానికి సీఎం అన్న విషయం కూడా మర్చిపోయి ఇష్టమున్నట్లు ప్రవర్తించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
దీనిపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో దీనిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కొర్ర చందర్ లాల్ గా గుర్తించారు.
Read more: Prakash Raj VS Nagababu: ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు.. పవన్ కళ్యాణ్ రచ్చవేళ ప్రకాశ్ రాజ్ మరోసారి సెటైరికల్ ట్విట్..
ఇతనిపై బీఎన్ఎస్ ప్రకారం 395/2026 కింద కేసు నమోదు చేసి కోర్టులో హజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఏదో ఆవేశంలో యువత ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి తమ జీవితాన్ని ఇబ్బందులపాలు చేసుకొవద్దని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.