
కారు కిటికీలు తెరిచి నడిపితే మైలేజీ పెరుగుతుందా? వాస్తవం ఏంటి?కారు కిటికీలు తెరిచి నడిపితే మైలేజీ పెరుగుతుందా? వాస్తవం ఏంటి? June 06, 2026 Subhash ఇంధనాన్ని ఆదా చేయడానికి చాలా మంది ఏసీ బంద్ చేసి
, కిటికీలు తెరిచి ప్రయాణిస్తారు. కానీ దీని వల్ల మైలేజీ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారా? ఇంధనం ఆదా కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంజన్‌పై భారం పడి మైలేజీ తగ్గుతుందని, అందుకే కిటికీలు తెరిచి నడపడం మంచిదని చాలా మంది భావిస్తారు. ఏసీ వాడకం - కిటికీలు తెరవడం
ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని పరిస్థితులలో కారు కిటికీలు పూర్తిగా తెరిచి డ్రైవ్ చేయడం వల్ల మైలేజీ పెరగకపోగా, మరింత తగ్గే అవకాశం ఉంది. అసలు నిజం
కార్ల తయారీలో గాలిని చీల్చుకుంటూ సులభంగా ముందుకు వెళ్లేలా (ఏరోడైనమిక్ డిజైన్) రూపుదిద్దుతారు. కానీ కిటికీలు తెరిచినప్పుడు బయటి గాలి నేరుగా కారు క్యాబిన్లోకి ప్రవేశిస్తుంది. గాలి ఒత్తిడి ప్రభావం
కిటికీల ద్వారా లోపలికి వచ్చే గాలి కారును వెనక్కి నెడుతుంది. ఇది ఒక పారాచూట్‌లా పనిచేసి కారు ముందుకు సాగకుండా ప్రతిఘటన సృష్టిస్తుంది.
గాలి ఒత్తిడి కారణంగా కారును ముందుకు తీసుకెళ్లడానికి ఇంజన్ సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇంజన్‌పై ఒత్తిడి పెరగడం వల్ల ఇంధన వినియోగం ఎక్కువై మైలేజీ పడిపోతుంది. ఇంజన్‌పై అదనపు భారం
గంటకు 50-60 కిమీ కంటే ఎక్కువ వేగంతో (హైవేలపై) వెళ్తున్నప్పుడు కిటికీలు మూసివేసి ఏసీ ఆన్ చేయడం వల్లనే మంచి మైలేజీ వస్తుంది. తక్కువ వేగంతో సిటీలో వెళ్తే కిటికీలు తెరిచినా నష్టం ఉండదు. వేగాన్ని బట్టి.. అందుకే హైవేలపై ప్రయాణించేటప్పుడు కిటికీలు మూసి ఉంచి ఏసీని సాధారణ మోడ్‌లో రన్ చేయడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ప్రయాణాన్ని హాయిగా మార్చుకోవచ్చు. స్మార్ట్ డ్రైవింగ్ చిట్కా
మరిన్ని వెబ్ స్టోరీస్ ఏసీకి గడువు ఉంటుందా? ఎన్నేళ్ల పాటు వాడవచ్చు..? ఇవి గుర్తించుకోండి టీవీని ఎంత దూరం నుంచి చూస్తే మంచిదో తెలుసా..? ఆధార్ ఉన్న వారికి గుడ్‌న్యూస్.. మరో ఏడాది పాటు ఉచితంగానే..!