
Niharika Konidela: మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన యాక్టివ్నెస్తో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. ‘ఒక మనసు’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన నిహారిక
.. హీరోయిన్గా పెద్ద సక్సెస్ సాధించకపోయినా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా సోషల్ మీడియాలో నలుపు రంగు చీరలో నిహారిక షేర్ చేసిన ఫోటోలు ట్రెండింగ్‌గా మారాయి.
నిహారిక కొణిదెల.. మెగా వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ముందుగా బుల్లితెరపై యాంకర్‌గా తన సత్తా చాటింది. తన అందం, అల్లరితో ప్రేక్షకులకు ఆల్‌టైమ్ ఫేవరేట్‌గా మారిపోయింది నిహారిక. ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్గా ఒక మనసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
తన టాలెంట్‌తో వరుసగా సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాలు చేసింది. తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. కానీ నిహారిక హీరోయిన్గా చేసిన సినిమాలు ఏవి పెద్దగా హిట్ కాలేదు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న నిహారిక.. ఎక్కువ కాలం భర్తతో కలిసి ఉండలేదు. మనస్పర్ధల కారణంగా డివొర్స్ తీసుకుంది.
రీసెంట్‌గానే పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్‌ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్‌గా మారింది. ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల సంగీత్ శోభన్ హీరోగా నటించిన రాకాస మూవీ కూడా నిహారికనే ప్రొడ్యూస్ చేసింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం తన అన్న వరుణ్ తేజ్‌తో 'బరి' అనే సినిమాని నిహారిక ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే నిహారిక ఎప్పుడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో బ్లాక్ కలర్ చీరలో దిగిన ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. నిహారిక షేర్ చేసిన ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.