
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Narendra Modi Creat New Record in india Politics: దేశ రాజకీయాల్లో రాణించడం… సమర్థ నాయకత్వం… సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం… ఆషామాషీకాదు… స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రధానిగా జవహార్‌లాల్ నెహ్రూది ఇన్నాళ్లుగా చెక్కుచెదరని చారిత్రక రికార్డ్. ప్రజాస్వామ్య ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేశానికి ప్రధాన మంత్రిగా ప్రాతినిథ్యం వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా 15 మంది ప్రధాన మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. ప్రజాస్వామ్య కూటమిలో బీజేపీ తరఫున నరేంద్రమోడీ సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నెహ్రూ రికార్డును బ్రేక్ చేశారు. భారతదేశ చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచింది.
2014లో భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్రమోడీ…..పాత రికార్డుల్ని మడతపెట్టేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రిగా పనిచేసిన జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ రికార్డుల్ని నరేంద్రమోడీ అధిగమించి… సరికొత్త రికార్డును నమోదు చేశారు. భారతదేశంలో రాష్ట్రప్రభుత్వ అధినేతగా.. దేశాధినేతగా నరేంద్రమోడీది ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి మంత్రి పదవికి రాజీనామా చేసి దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. సమర్థ నాయకత్వం…..సుస్థిర పాలనతో భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. 25 ఏళ్ల రాజకీయ అనుభవంతో ప్రభుత్వ పాలనలో వివిధ రికార్డుల్ని బ్రేక్ చేశారు. సరికొత్త రికార్డులను నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
2014 మే 26 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న మోడీ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీది ప్రత్యేక రికార్డు నమోదైంది. అంతేకాకుండా, 2014, 2019 , 2024లో వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెసేతర నేతగా రికార్డు చేశారు. బీజేపీ తరఫున జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థిగా నరేంద్రమోడీ వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల పాటు అత్యున్నత స్థాయిలో నిరంతర ప్రజా సేవతో పాటు రాజకీయ నాయకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. తన కెరీర్లో, ప్రధాని మోదీ గుజరాత్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉంది. ముఖ్యమంత్రిగా అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధానమంత్రిగా నిలవడం వంటి అనేక ముఖ్యమైన రికార్డులను నెలకొల్పారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ప్రధానిగా సుధీర్ఘకాలం పనిచేసిన మోడీ..
ఇపుడు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు 13 సంవత్సరాలకు పైగా గుజరాత్ రాష్ట్రానికి నాయకత్వం వహించారు. 2014 మే 26న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో లోక్‌సభలో పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారు. ఆ తర్వాత, రెండు పూర్తి పదవీకాలాలు పూర్తి చేసి, వరుసగా మూడోసారి తిరిగి ప్రధానమంత్రి అయిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.
ఎలాంటి విరామం లేకుండా… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా పనిచేసి దీనితో, 8,930 రోజుల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్‌ను ప్రధాని మోదీ అధిగమించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తన పదవీకాలాన్ని కలుపుకొని, ఆయన ఇప్పుడు ప్రభుత్వ అధిపతిగా 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు.
జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరా రికార్డులు బ్రేక్..
బారత ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు పని చేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, కాంగ్రెస్ నేత నెహ్రూ రికార్డును ఈ నెల 10తో అధిగమించబోతున్నారు. నెహ్రూ తొలి ఐదేళ్లు సెలెక్టెట్ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1952, 1957, 1962 ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఎలాంటి బలమైన ప్రతిపక్షాలు లేని సమయంలో గెలిచి రికార్డు క్రియేట్ చేశారు.
ఇందిరా గాంధీ జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984న ఆమె హత్యకు గురయ్యే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె తండ్రి జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా పనిచేసి, భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ప్రధాని మోడీ వరుసగా మూడు పర్యాయాలు 4,078 రోజుల పదవి కాలాన్ని పూర్తి చేసుకున్నారు. దీంతో భారతదేశంలో వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా ఇందిరాగాంధీ రికార్డును గతంలో నరేంద్రమోడీ బ్రేక్ చేశారు. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుసగా 4,077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీని నరేంద్ర మోడీ అధిగమించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరఫున భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన జవహార్‌లాల్ నెహ్రూ రికార్డును బ్రేక్ చేశారు. ఇపుడు నరేంద్ర మోడీ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశారు. సుధీర్ఘకాలం 4400 రోజులకు పైగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ ఏకైక వ్యక్తిగా నిలిచారు.
2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ.. 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ మెజారిటీకి అల్లంత దూరంలో ఆగిపోయింది. దీంతో మిత్ర పక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రధాని మోడీ డిజిటల్ రంగంలోనూ విశేష ప్రజాధరణతో దూసుకుపోతున్నారు. యూట్యూబ్ ఛానెల్లో 3 కోట్ల ఆరులక్షల మంది సబ్స్క్రైబర్లను చేరుకుని, ఆ ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా అనుసరించబడే ప్రపంచ నాయకులలో ఒకరిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. దీనితో, ఆయన ప్రస్తుతం సబ్స్క్రైబర్ల సంఖ్య విషయంలో అధికారంలో ఉన్న మాజీ ప్రభుత్వ అధినేతలందరిలోనూ అగ్రస్థానంలో ఉంటూ, ఇతర ప్రముఖ అంతర్జాతీయ రాజకీయ నాయకుల కంటే చాలా ముందున్నారు. ప్రధాని మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో 101 మిలియన్ల ఫాలోవర్లను దాటి, ఆ ప్లాట్ఫామ్లో ఈ మైలురాయిని సాధించిన తొలి అధికారంలో ఉన్న ప్రపంచ నాయకుడు, రాజకీయవేత్తగా రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 101 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. X ప్లాట్ఫామ్లో ప్రధాని మోదీకి 106.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. భారత ప్రధానిగా నరేంద్రమోడీ పదవీకాల వ్యవధి ముగిస్తే.. ఎవరికీ సాధ్యంకాని ఎవర్ గ్రీన్ రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ తరఫున జవహార్‌లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధ మాత్రమే ఎక్కువ కాలం ప్రధానిగా ప్రాతినిధ్య వహించారు. బీజేపీ తరఫున వాజ్ పేయి తర్వాత నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుధీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించిన నాయకుడిగా గుర్తింపు పొందారు. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీది చెక్కుచెదరని రికార్డుగా మిగిలిపోబోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.